దేశపౌరులందరికీ అధ్యక్షుడిగా వుంటా: డోనాల్డ్ ట్రంప్ Donald Trump pledges president for all citizens of america

Donald trump pledges president for all citizens of america

Hillary Clinton, Hillary first win, US Presidential Elections, election results, 45th president, America, democratic, republican, donald trump presidnet of US. american president donald trump

President-elect Donald Trump delivered his victory speech after a historic upset, pledging to be a president for 'every citizen of our land.'

దేశపౌరులందరికీ అధ్యక్షుడిగా వుంటా: డోనాల్డ్ ట్రంప్

Posted: 11/09/2016 03:21 PM IST
Donald trump pledges president for all citizens of america

అగ్రరాజ్యం మీడియా అంచనాలు, సర్వేలను అందకుండా కేవలం ప్రజల మద్దతుతో అధ్యక్ష సింహాసనానికి చేరువైన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్ ట్రంప్ అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడతానని హామీయిచ్చారు. ఎన్నికల వల్ల తనతో పాటు హిల్లరీ సహా మిగిలిన వారికి మద్దతు ప్రకటించిన ప్రజలందరూ ఇక వైషమ్యానాలను పక్కనబెట్టి సమైక్యంగా అభివృద్ది బాటలో సాగేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల విభజన గాయాలకు ఇకపై అభివృద్ది తో సాగాలని పిలుపునిచ్చారు.

అమెరీకన్లందరికీ తమ అధ్యక్షుడినని చెప్పారు. ఫలితాలు విడుదలైన తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. గెలుపోటములు సహజనమని, దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్కటే చారిత్రక విజయం కాదని, భవిష్యత్తులో అనేక సంచలన విజయాలను నమోదు చేసుకోవాల్సి వుందని ాయన చెప్పారు.

ఈ విజయం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు. తన విజయానికి పాటుపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు హిల్లరీ క్లింటన్ అభినందనలు తెలిపారని చెప్పారు. తాను కూడా హిల్లరీని అభినందించానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ఇద్దరం హోరాహోరీ తలపడ్డామని గుర్తు చేశారు. అమెరికా ఎప్పుడూ నంబర్‌ వన్‌ అని, అంతకన్నా తక్కువ అంగీకరించబోమన్నారు. తమ దగ్గర గొప్ప ప్రణాళిక ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేస్తానని ప్రకటించారు.

ప్రతీ పౌరుడు గర్వించదగ్గట్లుగా పనిచేస్తానని చెప్పిన అందరికన్నా దేశాన్ని అధికంగా ప్రేమిస్తానని కూడ చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలను రీడిజైన్ చేస్తానన్నారు. మన సంస్కృతిక వారసత్వాలను పునరుద్దరిస్తానని హామి ఇచ్చారు. దేశంలో ఇన్నాళ్లు మహిళలను, నల్లజాతీయులను విస్మరించారని, ఇకపై అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా తాను చూసుకుంటానని చెప్పారు. తన గెలుపుతో కష్టపడి పనిచేస్తే ఎలాంటి విజయానైనా సాధించవచ్చని

హిల్లరీ.. దుకాణం ఖాళీ..

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో హిల్లరీ దుకాణం(పార్టీ కార్యాలయం)బోసిగా మారింది. అక్కడున్న కొద్దిపాటి తన అభిమానులను అమె తప్పక విజయం సాధిస్తారని కౌంటింగ్ జరుగుతన్నా అక్కడే వున్నారు. అయితే హిల్లరీ బయటకు వస్తారని అనుకున్నా.. చివరి వరకు అమె గెలుస్తారని సర్వేల అంచనాలతో అమె విజయంపై ధీమా వ్యక్తం అయినా.. అమె పరబావాన్ని చవిచూశారు. దీంతో అమె నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది.

దీంతో డెమొక్రటిక్ అభ్యర్థి అభిమానులను కనీసం కలుసుకునే స్థితిలో కూడా లేరు. దీంతో హిల్లరీ క్లింటన్ ఈ రాత్రికి ఏమీ మాట్లాడరని, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని పార్టీ మద్దతుదారులకు ఆమె క్యాంపెయిన్ చైర్ జాన్ పొడెస్టా సూచించారు. మాన్హాటన్లోని జవిట్స్ సెంటర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బుధవారం తర్వాత వరకు దీనిపై ఎలాంటి కామెంట్ను హిల్లరీ చేయరని స్పష్టంచేశారు. హిల్లరీకి మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పొడెస్టా చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  donald trump  US Presidential Elections  45th president  America  

Other Articles