ట్రంప్ కోలుకోలేని షాక్ ఇవ్వబోతున్నాడా? | Donald Trump edges ahead of Hillary Clinton

Donald trump edges ahead of hillary clinton

Donald Trump storms ahead of Hillary Clinton, US president poll live, American elections 2016, New American President, Trump ahead, Hillary may lost US poll, Trump Hillary seats, US poll updates, US election live results, US elections complete result

Donald Trump storms ahead of Hillary Clinton with 150 electoral votes.

అమెరికా ఎన్నికలు అంచనాలు తారుమారు!

Posted: 11/09/2016 09:13 AM IST
Donald trump edges ahead of hillary clinton

ఊహించని షాక్ డోనాల్డ్ ట్రంప్ ఇవ్వబోతున్నాడా? హిల్లరీదే గెలుపని తేల్చేసిన సర్వేలు అంచనాలు తప్పబోతున్నాయా? కోతి, చేప జోస్యాలే ఫలించబోతున్నాయా? అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్లో క్షణక్షణానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంతో దూసుకుపోతుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. మొదట్లో పూర్తి ఆధిక్యం కనబరచటంతో విజయ ధీమాతో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చాలా వ్యత్యాసంతో రేసులో వెనుకబడిపోవటం విశేషం.

భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం కౌంటింగ్ మొదలైంది. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 168, హిల్లరీ 131 ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. అమెరికాలో ట్రంప్ 16 రాష్ట్రాలు, హిల్లరీ 10 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించారు. 14 రాష్ట్రాల్లో ట్రంప్, హిల్లరీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు కావాలంటే ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు సాధించాలి. కౌంటింగ్ ఫలితాల ట్రెండ్ ఇలా కొనసాగితే ట్రంప్ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి.

విద్వేషకర, వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ మెయిల్స్ లీకేజీ ఆరోపణలు వచ్చిప్పటికీ, విచారణ సంస్థ ఎఫ్ బీఐ క్లీన్ చీట్ ఇవ్వటంతో హిల్లరీయే గెలిచే అవకాశం ఉందని 90 శాతం సర్వేలు వెల్లడించాయి. దీంతో మీడియా కూడా హిల్లరీయే గెలుస్తుందని అంచనా వేసింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ దూసుకెళ్తున్నారు. కీలక రాష్ట్రమైన ఫ్లోరిడా సహా వర్జీనియా, ఒహియోలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ గెలుపు ఖాయమని, 72 శాతం ప్రజలు ట్రంప్ వైపు ఉన్నట్టు ఓ సర్వే పేర్కొంది. ఈ దశలో అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చుంటారనేది మధ్యాహ్నానికి తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US Presidential Elections 2016  Donald Trump  Hillary Clinton  

Other Articles