అమిత్ షాపై జైపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. గల్లీ పొలిటీషన్ అని ఎద్దేవా Jaipal reddy slams Amit Shah, calls him street politician

S jaipal reddy slams bjp national president amit shah

former union minister, S Jaipal reddy, Amit Shah, street politician, bjp national president, BJP, RSS, Congress,

former union minister S Jaipal reddy slams bjp national president Amit Shah, calls him street politician and not fit for national president

అమిత్ షాపై జైపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. గల్లీ పొలిటీషన్ అని ఎద్దేవా

Posted: 11/05/2016 03:03 PM IST
S jaipal reddy slams bjp national president amit shah

బీజేపి జాతీయ అధ్యక్షుడిపై కేంద్రమాజీమంత్రి జైపాల్ ‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఓ గల్లీ పొలిటీషన్ అని విమర్శించారు. జాతీయ స్థాయి పార్టీకి అధ్యక్షుడయ్యే అర్హత ఆయనలో అసలేమీ లేవని మండిపడ్డారు. జాతీయ దృక్పథం వున్న నేతలా ఆయన వ్యవహరశైలి లేదని దుయ్యబట్టారు. అర్ఎస్ఎస్ తో కలసి అమిత్ షా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికైనా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు.

జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కోనసాగుతూ ప్రాంతీయ తత్వానికి కట్టుబడటం సహేతుకం కాదని అన్నారు. సర్థార్ వల్లభబాయ్ పటేల్ గుజరాత్ వాసి కాబట్టి ఆయనను పొగుడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక పోరాటాలు జరిపిన జవహార్ లాల్ నెహ్రూను తూలనాటడం మానుకోవాలని జైపాల్ రెడ్డి హితవు పలికారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ, పటేల్‌ కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటివారన్నారు. పటేల్‌ను పొగడటంలో తప్పు లేదు కానీ నెహ్రూను కించపరచడం సరికాదన్నారు. హైదరాబాద్‌పై సైనికచర్య పటేల్ సొంత నిర్ణయం కాదని, నెహ్రూతో కలిసి తీసుకున్న నిర్ణయమే అని జైపాల్‌రెడ్డి గుర్తుచేశారు.

దేశభక్తి విషయంలో నేటి తరం యువతకు పాఠాలు చెబుతన్న ఆర్ఎస్ఎస్ గతంలో చేసిన తప్పిదాలను కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. క్విట్ ఇండియాలో బ్రిటీష్‌ వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ తొత్తుగా పనిచేసిందని ఆరోపించిన ఆయన ఇలాంటి తప్పిదాలను కూడా గుర్తుపెట్టుకోవాలని.. అప్పుడే మరోమారు తప్పులను పునారవృతం కాకుండా చడగలరన్నారు. కశ్మీర్‌లో పరిస్ధితి దిగజారడానికి, 120 రోజులుగా అక్కడి ప్రజలు కర్ఫ్యూ నీడలో తుపాకుల పహారాలో జీవనాన్ని సాగించడానికి మోదీనే కారణమని జైపాల్ రెడ్డి మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaipal reddy  Amit Shah  street politician  bjp national president  BJP  RSS  Congress  

Other Articles