ఆ స్కూల్ అమ్మాయిలంతా ఒకేసారి తల్లులయ్యారు | Buldhana teachers allegedly raping 12 students

Buldhana teachers allegedly raping 12 students

Buldhana teachers arrest, Buldhana School rape incidents, minor tribal students of Ninadhi Ashram school, Maharashtra teachers arrest, Gang rapes in school, teachers make student pregnant

Buldhana teachers arrested for allegedly raping 12 students and make them pregnant.

ముంబై స్కూల్లో అత్యాచారాల కలకలం

Posted: 11/04/2016 12:29 PM IST
Buldhana teachers allegedly raping 12 students

గురువు దైవంతో సమానం. ఎందుకంటే భవిష్యత్తును తీర్చిదిద్దేది వారే గనక. అలాంటి ప్రవృత్తికి మచ్చలు అంటిస్తున్నారు కామపిశాచులు. చిన్నపిల్లలని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు దిగటం లాంటివి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బుల్దానాలో ఓ దారణమైన ఘటన వెలుగు చూసింది. ఒకటి కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది మృగాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ దారుణ ఘ‌ట‌న వివరాళ్లోకి వెళ్లితే... పట్టణంలోని నందినీ ఆశ్రమ గిరిజన పాఠశాలలో గురువారం రాత్రి ఏకంగా 11 మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు టీచర్లు కాగా, మిగిలిన వారు ఇతర సిబ్బంది. 12 మంది గిరిజన బాలికలపై వీరు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీపావళికి పండగకు వెళ్లిన విద్యార్థినిలు తల్లిదండ్రులకు తమపై జరిగిన దాడి గురించి చెప్పటంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం విచారణ ప్రారంభించింది. అమ్మాయిలంతా 12 నుంచి 14 ఏళ్లలోపు వారేనని తెలుస్తోంది. వీరిలో 8 మంది గర్భవతులు అయ్యారని కూడా సమాచారం. మహిళా సిబ్బంది లేకపోవటం, సెక్యూరిటీ లేకపోవటంతో బయటివారు లోపలికి రావటం, తదితర అంశాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక మహారాష్ట్ర మొత్తంలో ఇలాంటి ఆశ్రమాలు వెయ్యికి పైగా ఉండగా, 4.45 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. అందులో సుమారు 2 లక్షలు అమ్మాయిలే ఉన్నారు. ఇక తాజాగా వెలుగు చూసిన ఘటనతో త‌మ ఆడ‌ పిల్ల‌ల్ని తిరిగి పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra teachers  Ninadhi Ashram school  Tribal Students  Arrest  

Other Articles