రబ్బరు పడవలు మునిగి 240 మంది జలసమాధి | 240 refugees die in two shipwrecks off Libya

240 refugees die in two shipwrecks off libya

Libya shipwrecks, Libya Ship Mishap, rubber dinghies sank, Libya migrants, Libya Migrants death toll, refugees die, two shipwrecks off Libya

Passengers from two rubber dinghies that sank just miles from the coast of Libya have told rescuers that as many as 240 migrants drowned attempting to make the journey to Italy.

240 మంది జలసమాధి అయ్యారు

Posted: 11/04/2016 07:37 AM IST
240 refugees die in two shipwrecks off libya

నిర్లక్ష్యం లిబియాలో పెను విషాదం నింపింది. వలస కూలీలతో వెళ్తున్న రెండు రబ్బరు పడవలు మునిగిన ప్రమాదంలో ఏకంగా 240 మంది జలసమాధి అయ్యారు. బుధవారం ఉదయం లిబియా తీరం నుంచి ఇటలీ బయలుదేరిన ఈ రెండు పడవల్లో జనాలు కిక్కిరిసి ఉండటంతోనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.

సుమారు 300 ప్రయాణికులు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అధికారులు మరో 30 మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే ఇంకా వంద మందికి పైగానే కనిపించకుండా పోయినట్లు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన వారు చెబుతున్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు, గర్భవతులు, వృద్ధులు ఉన్నారు.

కాగా, లిబియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. గ్రీస్, ఇటలీ, సైప్రస్, స్పెయిన్ లాంటి దేశాలకు సముద్ర మార్గం గుండా తరలిపోతుంటారు. ఈ క్రమంలో పొట్టకూటి కోసం వలస వెళ్తున్న కూలీలు కడుపు నిండకుండానే ప్రాణాలు విడుస్తున్నారు. ఒక్కోసారి ఆయా దేశాల గస్తీ దళాలు వీరిని కాపాడిన ఘటనలు ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు తరచూ ఇక్కడ సంభవిస్తున్నా, ఇంత పెద్దమొత్తంలో శరణార్థులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని ఐక్యరాజ్యసమితి వర్గాలు తెలిపాయి.

గతేడాది వరకు 3,777 మంది ఇలాంటి ప్రమాదాలతో మరణించగా, ఈ యేడాది ఇప్పటికే ఆ సంఖ్య 4,220కి చేరింది. గ్రీస్ ఇటలీ మధ్య ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుండటంతో ఆ ప్రదేశంలోనే ఎక్కువ మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం గత పదేళ్లకాలంలో సుమారు లక్షా 58 వేల మంది ఇలా లిబియా నుంచి తరలిపోయినట్లు ఓ అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Libya  rubber dinghies sank  240 died  

Other Articles