జర్నలిస్టుల మరణ మృదంగం | A journalist is killed every 4.5 days.

A journalist is killed every 4 5 days

journalists muder, Arab countries great threat for journalists, journalists killed, UNESCO journalists murders, 4.5 days 827 journalists

UNESCO submit a report says a journalist is killed every 4.5 days.

827 జర్నలిస్టుల మర్డర్ కలకలం

Posted: 11/03/2016 07:55 AM IST
A journalist is killed every 4 5 days

ఓవైపు విలువలు పాటిస్తూనే.. నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా వార్త రూపంలో ప్రజలకు తెలియజేయటమే అసలైన జర్నలిస్ట్ యొక్క పని. కానీ, ఈ కర్తవ్యం నెరవేర్చే క్రమంలో వారి ప్రాణాలకు ముప్పులు కూడా పొంచి ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ నాలుగున్నర రోజులకు ఓ జర్నలిస్ట్ హత్యకు గురవుతున్నాడన్న సంచలన నివేదిక ఇప్పుడు బయటపడింది. ఐక్యరాజ్యసమితి విభాగం యునెస్కో ప్రచురించిన ఓ రిపోర్ట్ ప్రకారం గత దశాబ్ద కాలంలో ఏకంగా 827 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని పేర్కొంది.

ఈ మరణ మృదంగం అరబ్ దేశాలైన సిరియా, ఇరాక్, లిబియా, యెమన్, లాటిన్ అమెరికా దేశాల్లోనే ఎక్కువగా ఉందని డైరక్టర్ జనరల్ వెల్లడించిన రిపోర్ట్ లో ఉంది. 2006-15 మధ్య కాలంలో కల్లోల ప్రాంతాలైన ఆయా దేశాల్లో (ఉగ్రవాద ప్రభావం) ఈ మరణాలు ఎక్కువగా సంభవించినట్లు తెలుస్తోంది. ఆ దశాబ్దకాలంలో 213 హత్యలు జరగ్గా, అందులో సగం అరబ్ దేశాల్లోనే నమైదయ్యాయి. అయితే విదేశాలకు చెందిన జర్నలిస్ట్ ల హత్యలే ఇక్కువ ఎక్కువ ఉండటం విశేషం.

ఆయా దేశాల్లో జర్నలిస్టుల విధులు కత్తిమీద సాములా మారాయని వివరించింది. గత రెండేళ్లలోనే 59 శాతం హత్యలు జరిగినట్టు తెలిపింది. జర్నలిస్టుల హత్యలు ఎక్కువగా అరబ్ దేశాల్లోనే జరిగాయని, పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికాలోనూ జర్నలిస్టులు హత్యకు గురైనట్టు పేర్కొంది. ఏసియా దేశాల్లో మాత్రం విదేశీ జర్నలిస్టులతో పోలిస్తే స్థానిక జర్నలిస్టులకే అధిక ముప్పు పొంచి ఉన్నట్టు తెలిపింది. మహిళ జర్నలిస్టులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిని అపహరించడం, లైంగిక దాడులు, హింసించి చంపడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. 39 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఈ నివేదికను సమర్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UNESCO report  journalists murders  

Other Articles