బాలయ్య-రోజా దీపావళి సెలబ్రేషన్స్ మరిచిపోలేదంట! | roja remebers her diwali celebrations with balayya

Roja remebers her diwali celebrations with balayya

balayya roja, balayya roja diwali celebrations, roja balayya diwali celebrations, Roja special diwali celebrations, actress roja with balakrishna

Actress Roja remebers her diwali celebrations with balayya at Peddannaya movie time.

రోజాకు స్పెషల్ దీపావళి మిగిల్చిన బాలయ్య

Posted: 10/31/2016 02:18 PM IST
Roja remebers her diwali celebrations with balayya

దీపావళి అంటే మాములు జనాలకే కాదు, సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండగ. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఇంటికి చేరి చిన్నపిల్లలై పోయి పటాసులు పేలుస్తూ సంతోషంగా గడిపేస్తుంటారు హీరోహీరోయిన్లు(ఎవరో రాంచరణ్ లాంటి డెడికేషన్ ఉన్న హీరోలు పండగపూట కూడా జిమ్ లో గడుపుతారు లేండి).  తాను ఆ లిస్ట్ లో ఉందంటున్నారు ఒకప్పటి అగ్ర హీరోయిన్, ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నా రోజా సెల్వమణి. దీపావళి పండుగకు కొత్త బట్టలు, మిఠాయిలు, సినిమాలు అన్నీ తనకు ఉండాల్సిందే అని చెబుతున్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యే .

ప్రతి దీపావళి తనకు ఎన్నో ఙ్ఞాపకాలను మిగుల్చుతోందని చెప్పిన ఆమె ఒక్క యేడాది మాత్రం తన లైఫ్ లో మరిచిపోలేనిదంట. అది కూడా నటసింహ బాలయ్యతో జరుపుకుంది కావటం విశేషం అంటోంది ఆమె. 'పెద్దన్నయ్య' సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు... తాను, బాలకృష్ణ కలిసి జరుపుకున్న దీపావళి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని... చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఆ దీపావళిని జరుపుకున్నామని చెప్పారు. తనతో పాటే అందరూ బాగుండాలని... తన వల్ల పది మందికి మంచి జరగాలని ఎప్పుడూ భగవంతుడిని కోరుకుంటానని రోజా తెలిపారు.

మొత్తానికి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరికీ ఆ ఛాన్స్ లేకపోయినప్పటికీ, అసెంబ్లీ సముదాయంలో కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా కలుసుకున్నప్పుడు మాత్రం మనం చూసి ఆనందించొచ్చు. ఇక దీపావళి పండుగకు తన అన్నయ్య పిల్లలు కూడా తమ దగ్గరకే వస్తారని తెలిపారు. ఈ దీపావళికి పిల్లలతో కలిసి పూరీ-కళ్యాణ్ రామ్ 'ఇజం' సినిమా చూసి తరించిందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  roja  diwali special  

Other Articles