పేరెంట్స్ కాస్ట్ లీ కోరిక కోసం ఆ యువతి అందంతో... | China woman buy new home with boyfriend's iphones

China woman buy new home with boyfriend s iphones

20 Boyfriends Buy Her 20 iPhones,China woman buy new home, iPhone cheating, 20 boyfriends 20 iPhones, china Xiaoli, Xiaoli iPhone cheating

20 Boyfriends Buy Her 20 iPhones. She Sells Them To Buy A House In China.

పేరెంట్స్ కోసం ఐఫోన్ లవ్... రైటా?రాంగా?

Posted: 10/31/2016 10:30 AM IST
China woman buy new home with boyfriend s iphones

తనను కన్నవారు ఆ యువతిని ఒకే ఒక్క కోరిక కోరారు. కాకపోతే అది చాలా కాస్ట్ లీది. ఆ చిరకాల కోరిక తీర్చాలంటే చాలా డబ్బు కావాలి. కానీ, ఆ అమ్మాయి ఏం చేయగలదు? తన దగ్గర ఉన్న అందాన్ని తాకట్టుపెట్టడం తప్ప!

అయితే అందుకోసం క్యారెక్టర్ కోల్పోవాల్సిన పనేం లేదని డిసైడ్ అయిన ఆ యువతి తెలివిగా ఫ్లాన్ వేసింది. నెలలు తిరక్క ముందే ఓ ఖరీదైన భవనంను తన పేరెంట్స్ కి గిప్ట్ ఇచ్చింది. చైనాలోని షెంజన్  అనే ప్రాంతంలో జియోలి అనే ఒక అమ్మాయి చేసిన ఈ పని ఏంటో మీరే చూడండి.

క్సియోలి.. కుటుంబంలో ఆమెనే పెద్దది. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి పోషిస్తోంది. తండ్రి చిన్న చిన్న కూలీపనులకు వెళ్తుటాడు, తల్లి ఇంటివద్దనే ఉంటుంది. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో, ఇల్లు కొనుక్కోవాలన్న తన ఆలోచన నెరవేరేలా లేదని ఒక నిర్ణయానికి వచ్చింది. తన అందాన్నే పెట్టుబడిగా పెట్టి అబ్బాయిలకు వల విసిరింది.

ఈ అమ్మడు ఒకేసారి 20 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను బుట్టలో వేసుకుంది. ఆమె లేనిదే వారు లేరు అన్న స్టేజీకి దిగజార్చింది. మెల్లిగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఖరీదైన ఐఫోన్ 7ను గిఫ్ట్‌గా తీసుకునేది. అలా 20మంది దగ్గర ఇరవై ఫోన్లను చాకచక్యంగా తీసుకోగలిగింది. వాటిని నేరుగా ‘హుయ్ షౌ నావ్’ అనే వెబ్‌సైట్లో అమ్మకానికి పెట్టేది. అలా ఐఫోన్లను అమ్మగా వచ్చిన మొత్తమెంతో తెలుసా..? మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల దాదాపు 14 లక్షల రూపాయలు. ఆ డబ్బుతో మూడోకంటికి తెలీకుండా ఒక ఖరీదైన ఇంటిని కూడా కొనగలిగింది.

చివరకు టైం బ్యాడ్ కావటంతో అడ్డంగా దొరికిపోయింది. చైనాలోని ‘వెయ్‌ బో’ అనే మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఒక్క బాయ్ ఫ్రెండ్ దొరక్క మేం చస్తుంటే... నువ్వు 20 మందిని ఎలా పడేశావ్.. అంతేనా ఐఫోన్ లు గిఫ్ట్ ఇచ్చే రేంజ్ కి ఎలా దిగజార్చగలిగావ్ అంటూ కొంత మంది యువతులు క్సియోనీని సలహా అడుగుతున్నారు. ఇక చైనీయుల ఐఫోన్ లవ్ పిచ్చి ఎలా ఉంటుందో తెలియజేస్తూ గతంలో ఓ యువకుడు రెండేళ్ల జీతంతో (82 వేల డాలర్లతో ) 99 ఐఫోన్లను కొని, హార్ట్ షేప్ లో పేర్చి యువతికి ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China woman  Xiaoli cheats  boyfriends  iPhones  new home  

Other Articles