పండగ పూట.. ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ 6 lakh SBI customers to get new debit cards

6 lakh sbi customers to get new debit cards

state bank of india, sbi, debit cards, 6 lakh new debit cards, cyber security breach, banking system

State Bank of India (SBI) has dispatched over 6 lakh new debit cards following reports of the biggest-ever cyber security breach in the country’s banking system.

పండగ పూట.. ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్

Posted: 10/30/2016 07:59 AM IST
6 lakh sbi customers to get new debit cards

దీపావళి పర్వదినాన ఆ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. దేశానికి చెందిన సుమారు ఆరు లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తూ కస్టమర్లకు షాకిచ్చిన దేశీయ అగ్రశ్రేణి బ్యాంకు ఎస్బీఐ, వారికి పండుగ రోజున శుభవార్తను అందించింది. వారి డిబిట్ కార్డులను బ్లాక్ చేసిన నేపథ్యంలో వారికి కొత్త కార్డులను జారీ చేస్తోంది. ఇటీవలే హితాచీ పేమెంట్స్ సర్వీసెస్లో మాల్వేర్ ఇనెక్షన్ వల్ల దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల తస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

ఇదివరకెప్పుడూ కనివినీ ఎరుగని విధంగా జరిగిన ఈ భారీ సైబర్ దాడిలో ఆరు లక్షల ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం ప్రభావితమైందని తెలిసింది. దీంతో ఎస్బీఐ ఆ కస్టమర్ల కార్డులను బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన 6.29 లక్షల కార్డులను రీప్లేస్మెంట్లో కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద రీప్లేస్మెంట్.
 
95.5 శాతం కార్డులను అక్టోబర్ 26న మంజూరు చేశామని, మిగతావారి కాంటాక్ట్ సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నామని బ్యాంకు తెలిపింది. ఇప్పటి వరకూ  వారు సంబంధిత బ్రాంచ్ల వద్ద సమాచారం అప్డేట్ చేయించుకోలేదని ఎస్బీఐ కార్పొరేట్ స్ట్రాటజీ, న్యూ బిజినెస్ డిప్యూటీ ఎండీ మంజు అగర్వాల్ చెప్పారు.  ఆ కస్టమర్లు కూడా బ్రాంచ్లను వద్ద సంప్రదించి, కొత్త కార్డులను తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మొత్తం 19 వివిధ బ్యాంకులపై ఈ సైబర్ అటాక్ జరిగింది. ఈ దాడిలో 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం తస్కరణకు గురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles