సిద్ధూ చుట్టూ చక్రవ్యూహాం! | Talks are going on with Navjot Sidhu and AAP top leaders

Talks are going on with navjot sidhu and aap top leaders

Sidhu AAP meetings, Sidhu ministries demand, Sidhu and AAP top leaders, Awaz-e -Punjab AAP, Sidhu Kejriwal, 2009 elections Sidhu case, Supreme cout sidhu

Talks are going on with Navjot Sidhu and AAP top leaders, another side SC orders trial of Sidhu for getting officer transferred before 2009 polls.

సిద్దూ-ఆప్ దోస్తీ: నో కంక్లూజన్?

Posted: 10/28/2016 07:20 AM IST
Talks are going on with navjot sidhu and aap top leaders

పంజాబ్ ఎన్నికల్లో చక్రం తిప్పి కీలకంగా మారుతాడనుకుంటున్న మాజీ క్రికెటర్, ఆవాజ్‌-ఇ-పంజాబ్‌ అధినేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూతో సామాన్య పార్టీ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆప్ నేతలు గురుప్రీత్ సింగ్ వరాచీ, దుర్గేష్ పాఠక్ అను స్వయంగా సిద్దూ యే వెళ్లి నిన్న రాత్రి చర్చలు జరపటం విశేషం. దీంతో పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు జోరుగా మారతున్నట్లు అవుతోంది. ఇది చాలదన్నట్లు సర్జికల్ స్ట్రైక్స్ తో బీజేపీ ఫేమ్ అమాంతంగా పెరిగిపోగా, అకాలీదళ్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలతో సవాలు విసురుతోంది.

ఇంకోపక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆప్ ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ ను చేజార్చుకోనివ్వకూడదని ధృడనిశ్చయంతో ఉంది. అందుకే అంతగా ఆసక్తి కనబరచని సిద్ధూను లాక్కునేందుకు ఓపక్క ఆప్, మరోపక్క కాంగ్రెస్ కూడా తమ వంతు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరోవైపు సిద్దూతో చర్చలు జరుపుతున్న విషయాన్ని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ నిర్ధారించారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ గెలుపొందేందుకు సిద్ధూ సహకారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తమ బంధం చర్చల దశలో ఉందని, నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో సిద్ధూ సమావేశమైనట్లు చెబుతున్నప్పటికీ, అందులో వాస్తవం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పంజాబ్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, ఆవాజ్‌-ఇ-పంజాబ్‌ పార్టీకి 7 నుంచి 8 సీట్లు కేటాయించాలని సిద్ధూ ఆప్‌ ను డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. కాగా, బీజేపీ నుంచి వేరుపడ్డ సిద్దూ తమ పార్టీలోకి వస్తే కీలకపదవితో ఆయననుసత్కరిస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధూను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలంటే ఆయన తమపార్టీలో ఉండడం ముఖ్యమని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి. కానీ, తన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదని, కేవలం మద్ధతు మాత్రమే ఇస్తుందని సిద్ధూ పార్టీ ఆవిర్భావ సమయంలో ఇప్పుడు పదవులు అడగటం వెనుక ఉద్దేశం ఏంటో అంతుబట్టడం లేదు.

ఇదిలా ఉండగా 2009 ఎన్నికల సమయంలో ఓ ప్రభుత్వాధికారిని తన ఎన్నికల కోసం బదిలీ చేసుకున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందిగా సిద్దూకి ఆదేశించింది. ఓపక్క చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు(ప్రస్తుతం అమృత్ సర్ ఎమ్మెల్యే ఓపీ సోని) ఈ పిటిషన్ దాఖలు చేయటం విశేషం. మరి తాజా పరిణామంతో ఇక ఆయన కాంగ్రెస్ లో చేరటం దాదాపుగా జరగదనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్దూ ఈ పిటిషన్ పై మాట్లాడుతూ... ’’ప్రజాప్రతినిధిగా ఎంతో మందిని బదిలీ చేయాల్సిన అవసరం రావోచ్చు. అయినా ఓ విద్యుత్ శాఖా అధికారి ఎన్నికల గెలపొటములలో ఎలా ప్రభావం చూపుతాడో అర్థం కావటం లేదు. అయినా ఈ వ్యవహారం కోర్టు చూసుకుంటుంది’’ అని ఆమె వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navjot Singh Sidhu  Awaz-e -Punjab chief  AAP support  Punjab 2017 elections  

Other Articles