గాలి పెళ్లిలో డాన్సుల కోసం తమ్మూ, కత్రినా... | Bollywood stars stage performance in Gali daughter's wedding

Bollywood stars stage performance in gali daughter s wedding

Gali daughter's wedding, Shah Rukh Khan, Katrina Kaif, Tamannaah, Bollywood stars dance at Gali wedding, Budget for Gali Janardhan's Daughter wedding, IT Gali daughter Marriage, Celebs at Gali Janardhan daughter wedding, SRK Katrina Prabhu deva and Tamanna

Shah Rukh Khan, Katrina Kaif, Tamannaah to perform at Gali Janardhan's daughter wedding.

గాలి పెళ్లిలో మరో సంచలనం?

Posted: 10/27/2016 10:20 AM IST
Bollywood stars stage performance in gali daughter s wedding

బాలీవుడ్ టాప్ తారలంతా త్వరలో ఓ పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారా? అది కూడా దక్షిణాదిన జరగబోయే ఓ మాజీ మంత్రి ఇంట. అదెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును... ఇప్పటికే ఎల్సీడీ వెడ్డింగ్ కార్డుతో దేశం మొత్తం తన కూతురి పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేసిన కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.

నవంబర్ 16న బెంగళూర్ లోని పాలెస్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విక్రమ్ దేవరరెడ్డి కొడుకు రాజీవ్ తో గాలి కూతురు బ్రాహ్మిణి వివాహం జరగనుంది. ఈ పెళ్లి కోసం సుమారు 550 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.

పెళ్లి కోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో గాలి బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతోసహా ఇప్పటికే చాలా మంది జాతీయ నేతలకు, ముఖ్యమంత్రులకు, కేబినెట్ మంత్రులకు, వీవీఐపీలకు ఆయన కార్డులను అందజేశాడు. ఇంకోవైపు సినీ సెలబ్రిటీలను కూడా ఆయన ఆహ్వానించాడు. కన్నడలోని టాప్ స్టార్లకు ఇంటికి స్వయంగా వెళ్లిన జనార్దన్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రత్యేక ఆహ్వానం పంపాడు. ఇక పెళ్లికి ప్రత్యేకత తేవాలి అనకున్నాడో ఏమో ఏకంగా బాలీవుడ్ తారలతో కచేరీ పెట్టించేందుకు సిద్ధమైపోతున్నాడు.

ఆ వివాహ వేడుకలో టాప్ తారలు ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, కత్తినా కైఫ్, సౌత్ స్టార్లు ప్రభుదేవా, తమన్నాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కన్నడ, కోలీవుడ్ వర్గాలకు చెందిన నటీనటులు కూడా స్టేజీ ఫెర్ పార్మెన్స్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. కేవలం వెడ్డింగ్ కార్డు కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేసిన గాలి పెళ్లి ఇంకెంత వైభవంగా చేస్తారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోపక్క ఆదాయ పన్నుల శాఖ కూడా ఓ కన్నేసి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh