ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా మారిన దాయాధి పాకిస్థాన్‌ను మరోమారు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఉగ్రవాదంపై ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నేలమట్టం చేసేందుకు తానే స్వయంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోననని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తమ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులన్నింటిపై చర్యలు తీసుకోవడం లేదని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి రావొచ్చునని తేల్చిచెప్పింది.
'తమ భూభాగంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లన్నింటిపైనా కఠినంగా వ్యవహరించమని మేం భాగస్వామి అయిన పాకిస్థాన్‌ను కోరుతూ వస్తున్నాం. వారికి సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులకు నిధులను అడ్డుకోవడంలో, వారి కార్యకలాపాలు నిలువరించడంలో పాకిస్థాన్‌కు మా సహకారం ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదని ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునే అంశంలో అండర్ సెక్రటరీగా ఉన్న ఆడమ్ జుబిన్ పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడానికి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) నిరాకరిస్తున్నది. కొన్ని ఉగ్రవాద గ్రుపుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. అదే సమయంలో ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడానికి అమెరికా స్వయంగా రంగంలోకి దిగడానికి ఏమాత్రం వెనుకాడబోదు' అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ తమ కీలక భాగస్వామిగా కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే.. అవసరమైతే తామే స్వయంగా ఉగ్రవాద గ్రూపుల భరతం పడతామని ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more