హమ్మయ్యా... ముష్కిల్ వివాదం ముగిసింది. కానీ, కండిషన్ అప్లై | Raj Thackeray's MNS clearance to Ae Dil Hai Mushkil release.

Raj thackeray clearance to ae dil hai mushkil release

Raj Thackeray clear for Ae Dil Hai Mushkil release, Ae Dil Hai Mushkil release controversy closed, Devendra Fadnavis Karan Johar Raj Thackrey, Ae Dil Hai Mushkil release on time, Ae Dil Hai Mushkil tribute to Uri attack victims, Ae Dil Hai Mushkil tribute to Army, MNS not oppose Ae Dil Hai Mushkil release

Raj Thackeray's The Maharashtra Navnirman Sena or MNS cleared for Ae Dil Hai Mushkil release after producers promised to tribute the movie to Army.

ముష్కిల్ వివాదం ముగిసింది.. కండిషన్స్ అప్లై

Posted: 10/22/2016 11:21 AM IST
Raj thackeray clearance to ae dil hai mushkil release

యే దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎట్టకేలకు క్లియరెన్స్ లభించింది. బాలీవుడ్ గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకోవటంతో యే దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల కావటంపై అనుమానాలు నెలకొన్నాయి. పాక్ నటుల విషయంలో బెట్టుచేసిన ఎంఎన్ఎస్ శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దౌత్యంతో ఎట్టకేలకు దిగొచ్చింది.

యూరీ ఘటన అనంతరం పాక్ నటులపై నిషేధం విధించడం, ఆపై ఈ సినిమాలో పాక్ నటుడు నటించడంతో సినిమాను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిర్మాత కరణ్ జోహార్ కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇకపై పాక్ నటులను తీసుకోనంటూ వీడియోలో సారీ కూడా చెప్పాడు. మరోవైపు రణ్ బీర్ కూడా తన కష్టంను ఆపొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు.

అయినా ఎంఎన్ఎస్ తగ్గలేదు. దీంతో మరో మేకర్ మహేష్ భట్, అపూర్వ మెహతా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. వారు చెప్పిందంతా విన్న ఆయన సీఎంలతో తాను మాట్లాడతానని, అవసరమైతే పోలీస్ భద్రత కల్పించైనా సినిమా విడుదల చేయిస్తానని హామీ ఇచ్చాడు. ఇది జరిగిన రెండు రోజులకే సమస్య పరిష్కారం కావటం విశేషం.

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే, నిర్మాత కరణ్ జోహార్ లు మిగతా నిర్మాతలతో కలిసి శనివారం ఉదయం సీఎం ఫడ్నవీస్ ఇంట్లో చర్చలు జరిపారు. భవిష్యత్తులో పాక్ నటులను తీసుకోమని వారు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బయటకు వచ్చిన వారు సినిమాను అడ్డుకోమని ప్రకటించడం విశేషం. అయితే సినిమాను సైనికులకు నివాళిగా ప్రకటిస్తాలన్న కండిషన్ కు కరణ్ ఒప్పుకోవటంతోనే ఎంఎన్ఎస్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 28న యే దిల్ హై ముష్కిల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ae Dil Hai Mushkil release  Raj Thackrey  MNS  Not oppose  

Other Articles