వారం రోజుల్లో అమ్మకు విడుదల | AIADMK official announcement on Jayalalitha's Discharge

Aiadmk official announcement on jayalalitha s discharge

AIADMK official announcement on Jayalalitha's Discharge, Jayalalitha Discharge from Hospital, Tamil Nadu CM Jayalalitha Health Condition, Jayalalitha completely well, Jayalalitha return home, Jayalalitha cure

AIADMK official announcement on Jayalalitha's Discharge from Apollo Hospital.

అఫీషియల్: వారం తర్వాత అమ్మ మన ముందుకు...

Posted: 10/21/2016 09:23 AM IST
Aiadmk official announcement on jayalalitha s discharge

అన్నాడీఎంకే పార్టీ జయలలిత ఆరోగ్యంపై అధికారిక ప్రకటన చేసేసింది. ప్రస్తుతం కోలుకుంటున్న ఆమెను మరో వారంరోజుల్లో ఆస్పత్రిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రకటించారు. దేవుడు అమ్మ వైపు ఉన్నాడు. అందుకే ఆమె త్వరగా కొలుకుంటున్నారని ఆమె తెలిపారు.

ఈ నెల 26 లేదా 27 తేదీల్లో, లేదంటే అదనంగా మూడు రోజులు తర్వాత అయినా ఆమె నుంచి డిశ్చార్జయ్యే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం జయలలితకు ఫిజియోథెరపీ చికిత్స మాత్రమే కొనసాగుతోంది. దీంతో ఆమె పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో వుంటే సరిపోతుందని వైద్యులు చెప్పినట్టు అన్నా డీఎంకే ఆ ప్రకటనలో తెలిపింది. ఇక ఎంజీఆర్ హయాంలో ఆరోగ్య మంత్రిగా పని చేసి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న హెచ్ వీ హండే నిన్న ఆమెను పరామర్శించాడు. బయటకు వచ్చిన ఆయన ఆమె త్వరగా కోలుకుంటున్నారని చెబుతూ, పది రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఖరారు చేసేశారు.

68 ఏళ్ల జయలలిత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమెకు లండన్‌ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే సమక్షంలో అపోలో ఆసుపత్రి, ఎయిమ్స్, సింగపూర్ వెద్య నిఫుణులు చికిత్స అందిస్తున్నారు. సుమారు నెల రోజులుగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో తమిళనాట తీవ్ర ఆందోళన నెలకొంది. ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారు కూడా.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ ఆమె కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యుల బృందం మరోసారి ఆమె ఆరోగ్యంపై పూర్తి అధ్యయనం చేసి, త్వరగతిన డిశ్చార్జ్ చేయాలనే నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ వార్తతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalitha Discharge  Apollo Hospital  

Other Articles