అక్కడ కూడా అధికార పార్టీకి.. అంతే సంగతులు India Today-Axis Opinion Poll says BJP is set to win Uttarakhand

India today axis opinion poll says bjp is set to win uttarakhand

India Today-Axis Opinion Poll, Uttarakhand elections, BJP, BC Khanduri, Harish rawath, Uttarakhand Assembly polls, Congress,

The survey also found nearly half of the voters in the Himalayan state want BJP veteran BC Khanduri to return as their Chief Minister.

అక్కడ కూడా అధికార పార్టీకి.. అంతే సంగతులు

Posted: 10/15/2016 07:46 PM IST
India today axis opinion poll says bjp is set to win uttarakhand

దేశంలో క్రమంగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అదే పరిస్థితి ఎదురవ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ  అధికార కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పరాభవమే ఎదురవ్వనుంది. కాంగ్రెస్ అధికారాన్ని ఇప్పటికే తుడిచిపెట్టి, రాష్ట్రపతి పాలన విధించడంతో.. అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది, అయితే పొంత పార్టీ ఎమ్మెల్యేలకే డబ్బులిస్తూ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అడ్డంగా వీడియోలకు చిక్కారన్న బీజేపి ప్రచారం మాత్రం ప్రభావం చూపింది.

రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలన అందుకనే విధించామని చెబుతూ ప్రచారంతో బీజేపికే అక్కడ అధికారం అందే అవకాశాలు వున్నాయని సమాచారం. ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం సాధిస్తుందని యాక్సిస్-ఇండియా టుడే నిర్వహించిన ఒపీనియన్ పోల్లో తేలింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ 38 నుంచి 43 సీట్లు గెలిచే అవకాశముంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్లో బీజేపీ మెజార్టీ మార్క్ దాటుతుంది.

దాదాపు 50 శాతం మంది ఓటర్లు బీజేపీ సీనియర్ నేత బీసీ ఖండూరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు సర్వేలో తేలింది. 2007-09 మధ్య, మరో పర్యాయం 2011-12 మధ్య కాలంలో ఖండూరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 26 నుంచి 31 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. కాగా ముఖ్యమంత్రి హరీశ్ రావత్పై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. 41 శాతం మంది ఓటర్లు హరీశ్ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand Assembly polls  BJP  India Today-Axis Opinion Poll  Congress  

Other Articles