ఆ సర్జరీతో వీణా-వాణీలలో చిగురిస్తున్న అశలు Conjoined twins separated, both out of surgery

Conjoined twins separated both out of surgery

surgery, parents, james goodrich, craniopagus, nicole, twin, jadon, American conjoined twins, Dr. James Goodrich, Montefiore Medical Center, NewYark

Twin baby boys conjoined at the head were successfully separated early Friday at the Children's Hospital at Montefiore Medical Center in the Bronx.

ఆ సర్జరీతో వీణా-వాణీలలో చిగురిస్తున్న అశలు

Posted: 10/15/2016 07:43 PM IST
Conjoined twins separated both out of surgery

తెలుగురాష్ట్రానికి చెందిన అవిభక్త కవలలు వీణా-వాణిలలో మరిన్నీ అశలు చిగురింపజేసింది అమెరికా. వీణా-వాణీలను సర్జరీ చేసి విడదీయాలని ఎందరో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఏళ్లుగా వారి అశలు సన్నగిల్లాయి, దీంతో చేసేది లేక వారి అలనా పాలనా ప్రభత్వమే చూసుకుంటుంది. అయితే అగ్రరాజ్యానికి చెందని వైద్యులు అరుదైన అపరేషన్ చేసి తలలు అతుక్కుని పుట్టిన ఇద్దరు న్యూయార్క్ అవిభక్త కవలల చిన్నారులను విడదీయడంతో వీణా వాణీలలో విశ్వాసం మరింత గెలిచింది.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 13 నెలల జేడన్, అనియాస్ అవిభక్త కవలలు. వీళ్లిద్దరినీ వేరు చేసేందుకు అక్కడి మాంటెఫెర్ పిల్లల ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన 27 గంటల ఆపరేషన్ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. నికోల్‌, క్రిస్టినా దంపతులకు రెండో సంతానంగా జన్మించిన కవలలకు తలలు అతుక్కుని ఉన్నాయ. విడివిడిగా కాకుండా కపాలాలు రెండూ కలిసిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులు డాక్టర్ జేమ్స్ గుడ్ రిచ్ ను సంప్రదించారు. అప్పటికే కష్టతరమైన ఆపరేషన్లు ఎన్నో చేసిన అనుభవం ఉందాయనకు.

అయితే జేడాన్, అనియాస్ లది కష్టతరమైన కేసు. చిన్న తేడా వచ్చినా పిల్లల ప్రాణాలు పోతాయి. చివరికి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆపరేషన్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. డాక్టర్ జేమ్స్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది వైద్యులు 27 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. మొదటి 16 గంటలు పిల్లల తలలను వేరుచేయడానికే పట్టింది. తర్వాత త్రీడీ టెక్నాలజీ సాయంతో కపాలాలను వేరుచేశారు. సర్జరీకి మరో 11 గంటలు పట్టింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన వెంటనే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : American conjoined twins  Dr. James Goodrich  Montefiore Medical Center  NewYork  

Other Articles