తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు సుబ్రహ్మణ్యస్వామి డిమాండ subramanian Swamy demands President's rule in TN

Subramanian swamy demands president s rule in tamil nadu

Jayalalithaa, jayalalithaa health, subramanya swamy, bjp mp, president rule, vidyasagar rao, Rajnath singh, Jayalalithaa news, Jayalalithaa latest news, Jayalalithaa sickness, aiims, aiims doctors, Jayalalithaa checkup, tamil nadu AIADMK, jayalalithaa Health, Jayalalithaa, apollo hospital, chairman pratap reddy, Richard John Beale, States, Tamil Nadu

Tamil Nadu Chief Minister J Jayalalithaa needs "a longer stay in hospital" and is "making gradual progress," said doctors today who are attending to the 68-year-old politician.

పరామర్శకు బదులు.. స్వామి అసంబద్ద వినతి..!

Posted: 10/07/2016 06:20 PM IST
Subramanian swamy demands president s rule in tamil nadu

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊపిరి తిత్తుల్లో ఇన్ పెక్షన్ సోకడం, మధుమేహంతో పాటు వింటర్ బ్రాంకైటిస్ కారణంగా గత పక్షం రోజులుగా అస్పత్రిలో వుంటూ చికిత్స చేయించుకున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు అమె అరోగ్యం విషయమై తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చైన్నెలోని అపోలో అస్పత్రికి వెళ్లి మరీ అమెను పరామర్శించారు.

ఈ నేపథ్యంలో అమెను పరామర్శి.. మీకు అండగా మేమున్నామన్న ధైర్యం అమెకు కొండంత శక్తిని ఇస్తుంది. కానీ బీజేపి సీనియర్ నేత సుభ్రహ్మణ్య స్వామి అమెను పరామర్శించలేదు సరికగా, అమె మరింత దిగాలు చెందే విధంగా అసంబద్ద వినతిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ముందు పెట్టారు. అదేంటంటే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని. ముఖ్యమంత్రి అనారోగ్యంతో పాలన పరాయి చేతుల్లోకి వెళ్లిందని, ఈ క్రమంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని అయన విన్నవించారు.

ఈ మేరకు సుబ్రహ్మణ్యస్వామి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. జయలలిత కోలుకునే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... అవి ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జయలలితను రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇవాళ పరామర్శించారు. అమె కోలుకుంటున్నారని తమిళనాడు రాజ్ భవన్ లేఖను విడుదల చేసింది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  jayalalithaa health  subramanya swamy  bjp mp  president rule  vidyasagar rao  

Other Articles