వెంటిలేటర్ పై జయలలిత.. మరిన్నీ రోజులు అస్పత్రిలోనే.. Jayalalithaa needs longer stay, says hospital

Jayalalithaa requires longer stay in hospital apollo hospitals says

Jayalalithaa, Jayalalithaa news, Jayalalithaa latest news, Jayalalithaa sickness, aiims, aiims doctors, Jayalalithaa checkup, tamil nadu AIADMK, jayalalithaa Health, Jayalalithaa, apollo hospital, chairman pratap reddy, Richard John Beale, States, Tamil Nadu

Tamil Nadu Chief Minister J Jayalalithaa needs "a longer stay in hospital" and is "making gradual progress," said doctors today who are attending to the 68-year-old politician.

కుదటపడుతున్న పురచ్చితలైవి అరోగ్యం.. మరిన్నీ రోజులు అస్పత్రిలోనే.

Posted: 10/07/2016 07:17 AM IST
Jayalalithaa requires longer stay in hospital apollo hospitals says

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కుదటపడుతుందని అపోలో అస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జయలలిత వెంటిలేటర్ సాయంలో శ్వాస తీసుకుంటున్నారని.. అమె తన సోంతంగా శ్వాస తీసుకునే వరకు అస్పత్రిలో వుండాల్సిన అవసరం వుందని వైద్యులు తెలిపారు, పురచ్చి తలైవి పూర్తిగా కొలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్య బృందం ముఖ్యమంత్రికి చికిత్సను అందిస్తున్నారని, వారి వైద్యానికి అమె సహకరిస్తున్నారని కూడా అపోలో వర్గాలు స్పష్టంచేశాయి.

ప్రత్యకంగా జయలలిత అరోగ్యం నేపథ్యంలో లండన్‌ నుంచి వచ్చిన క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బేల్ కూడా జయలలితను మరోమారు పరీక్షించారని అపోలో అస్పత్రి వర్గాలు తెలిపాయి. జయలలితకు ఉన్న మధుమేహం, వింటర్ బ్రాంకైటిస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వైద్యుల సూచనల మేరకు మెడికల్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించినట్టు అపోలో సీఈవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ జి.ఖిల్నానీ, అనస్తీషియాలజీ, క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ అంజంత్రికా, కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ నితిశ్ నాయక్ జయలలితను పరీక్షించారు.

కాగా, జయలలిత వద్దకు అతికొద్ది మందికి మాత్రమే అనుమతి లభిస్తోంది. ఆమె దత్తాపుత్రుడుకి కూడా అనుమతి లభించకపోవడంతో నిన్న రాత్రి అస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జయలలిత కుమారుడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా వున్న నేపథ్యంలో ఆయనను గత కొన్ని సంవత్సరాలుగా జయలలిత దూరం పెట్టిన విషయం తెలిసిందే. అయితే అమ్మ అరోగ్యం విషమించిన నేపథ్యంలో అమెను చూసేందుకు అస్పత్రి వద్దకు వచ్చిన కరుణాకరన్ కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  jayalalithaa health  AIIMS doctors  apollo hospital  Tamil nadu  

Other Articles