రన్నింగ్ ట్రయిన్ నుంచి దూకిన జంట.. అబ్బాయి సేఫ్... మరి అమ్మాయి? | Cop saves woman from being crushed under train in Maharashtra

Cop saves woman from being crushed under train in maharashtra

Cop saves woman from being crushed, Couple jump from Running train girl safe, Cop saves woman from jump train, Mumbai flat form Shocking Video, Train jumps in Running train just miss, Train Dragged woman, woman from being crushed under train, Maharashtra Girl Train Video

Cop saves woman from being crushed under train in Maharashtra.

ITEMVIDEOS:కాస్తుంటే ఆ యువతి పరిస్థితి ఏమయ్యేది?

Posted: 09/26/2016 03:26 PM IST
Cop saves woman from being crushed under train in maharashtra

కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించినా చాలూ ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఓ యువతి ఇలాగే అజాగ్రత్తతో కాస్తలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూకేసింది. అయితే ఆ వేగానికి రైలు అమాంతం ఆ అమ్మాయిని లోపలికి లాగేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూడండి.

 

మహారాష్ట్రలోని లోనా వలాలో ఓ యువతి రన్నింగ్ ట్రయిన్ లోంచి అమాంతం దూకేసింది ఆ స్పీడ్ కి రైలు లాగేసుకోగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ అప్రమత్తం కావటంతో ప్రమాదం నుంచి బయటపడింది. కాకినాడ ఎక్స్ ప్రెస్, స్టేషన్ కి చేరుకోగానే ఓ జంట వేగంగా ఉండగానే ట్రయిన్ లోంచి దూకేసింది. యువకుడు ఫ్లాట్ ఫామ్ మీద పడిపోగా, యువతి మాత్రం ఆ వేగానికి రైలు కిందకు వెళ్లిపోయింది.

అయితే అదృష్టవశాత్తూ పట్టాల లోపలి దాకా వెళ్లిపోకుండా మధ్యలోనే యువతి ఆగిపోయింది. ఇది గమనించిన ఓ రైల్వే కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ యువతిని బయటికి లాగేశాడు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణ నష్టం తప్పదని, దయచేసి ఇలాంటి ఫీట్లు చెయొద్దని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్ లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Railway Flat Form  Girl Jump  Safe  

Other Articles