కార్యకర్త హత్యపై కూతుళ్ల నిలదీత... చంద్రబాబు మౌనం | chandrababu assure Boya venkat reddy family who murder decade ago

Chandrababu assure boya venkat reddy family who murder decade ago

chandrababu in Gurajala Tour. Babu Assure Boya venkat reddy family, బోయవెంకట్ రెడ్డి కుటుంబానికి బాబు భరోసా, బోయవెంకట్ రెడ్డి హత్య, Chandra Babu with on Boya Venkat Reddy Family, Chandrababu in Gurajala Tour, Chandrababu visits Flood Area

chandrababu in Gurajala Tour. Assure Boya venkat reddy family who murdered by oppositions a decade ago.

కార్యకర్త హత్యపై కూతుళ్ల ప్రశ్నలు... బాబు సైలెంట్!

Posted: 09/26/2016 12:14 PM IST
Chandrababu assure boya venkat reddy family who murder decade ago

పదేళ్ల క్రితం ఓ టీడీపీ పార్టీ కార్యకర్త హత్య ఉదంతం ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కలచివేసింది. సోమవారం గురజాల, మాచర్ల నియోజకవర్గాలలోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన కార్యకర్త బోయ వెంకట్ రెడ్డి పిల్లలు చంద్రబాబును పలకరించారు.

"మీకు గుర్తుందా సార్... మా నాన్న బోయ వెంకటరెడ్డి, ఆయన్ను, మిట్టగుడిపాడు సర్పంచ్ గొట్టం రామకోటిరెడ్డిని ఇక్కడే వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దారి కాచి చంపారు సార్" అని బోయ వెంకటరెడ్డి కుమార్తెలు శ్రీలత, పద్మలు, దాదాపు 17 ఏళ్ల తరువాత తమ ఊరికి వచ్చిన సీఎం చంద్రబాబుకు చెబుతుంటే, కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ‘మాకు మగ దిక్కు లేదు సార్‌.. మా అమ్మ కూలీ చేసి మమ్ములను చదివించందంటూ’ చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అయితే అదే సమయంలో పక్కనున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును చూపిస్తూ... ఆయన సాయం చేయకుంటే మేం వీధుల పాలయ్యేవాళ్లమని పేర్కొనడంతో చంద్రబాబు హర్షం వ్యక్తం చేశాడు.

Chandrababu Boya Venkatreddy family

"ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా?" అని చంద్రబాబు అడుగగా, మోడల్ స్కూల్లో తాత్కాలిక పద్ధతిలో తను, ఫిషరీస్ డిపార్ట్ మెంట్ లో చెల్లెలు పనిచేస్తున్నామని శ్రీలత చెప్పడంతో, ప్రయోజకులైనందుకు సంతోషంగా ఉందని, మీ కుటుంబాన్ని తప్పక ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లారు. కాగా, 2006లో జూన్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరై రెంటచింతలకు వస్తున్న బోయ వెంకట్ రెడ్డి, మరికొందరిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Flood arers  Gurajala  Boya Venkatreddy  Family  

Other Articles