ఒప్పంద ఉల్లంఘనలు, సరిహద్దు దాటి కాల్పులు... అంతర్జాతీయ వేదికలపై పిచ్చి ప్రేలాపనలు... వరుసబెట్టి జవాన్లను పొట్టనబెట్టుకుంటున్నా ఇంకా చేతగానీ వారిలా చూస్తూ ఉండిపోవాలా అని ప్రశ్నిస్తున్న వంద కోట్ల భారతీయ జనాభా. తమ సహచరులను మట్టుపెడుతున్నా ఓవైపు రక్తం సలసల రగిలిపోతున్నప్పటికీ, చేతగానీ వారిలా చూస్తూ ఉండిపోవాలా అంటూ ప్రశ్నిస్తున్న సైనికులు. అయినా ప్రభుత్వం తొందరపాటు చర్యలకు అదును చూసి దెబ్బ కొట్టాలనే చూస్తోంది. ఇందులో భాగంగానే గన్ పట్టకుండా పాక్ కి ఘోరమైన దెబ్బకొట్టాలన్న ఫ్లాన్ వేస్తోంది.
ఒక్క తుపాకీ కూడా వాడకుండా పాక్ వెన్నులో భయం పుట్టాలంటే, మరోసారి ఉగ్రవాదులకు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోకుండా చేయాలంటే వాటర్ పాలిటిక్స్ ను వాడాలని చూస్తోంది. హిమాలయాల్లో పుట్టి రెండు దేశాల్లో ప్రవహిస్తున్న నదుల నుంచి పాక్ కు నీటి ప్రవాహాన్ని నిలువరిస్తే సరిపోతుందన్న ఆలోచన చేస్తోంది. ఒకవేళ, ఆ సమయంలో కూడా పాక్ దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తే మాత్రం నీటిని ఒక్కసారిగా విడుదల చేసి వరదలతో ఇబ్బందులు సృష్టించాలని నీటి నిపుణులను కేంద్రానికి సలహా ఇస్తోంది.
1960లో కరాచీ వేదికగా భారత్ -పాక్ 'ఇండస్ ఒప్పందం' కుదుర్చుకున్నాయి. రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు, ఇండస్, జీలం, చీనాబ్ నదులు పాకిస్థాన్ కు దక్కాయి. ఇవన్నీ ఇండియా మీదుగా, పాకిస్థాన్ కు ప్రవహించేవే. ఇక ఈ నదుల ప్రవాహం, పాకిస్థాన్ లోని పలు జిల్లాలను సస్యశ్యామలం చేసి అభివృద్ధికి బాటలు వేసింది. ఈ బప్పందం ప్రకారం బోర్డులో ఇరు దేశాలకు చెందిన అధికారులూ ఉంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ ఇండస్ వాటర్ కమిషన్ ను సస్పెండ్ చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
అసలు ఈ ఒప్పందం రద్దు చేస్తున్నామన్న ఒక్క మాట భారత్ నోటి వెంట వస్తే చాలూ, పాక్ పాలకులపై అమితమైన ఒత్తిడి పడుతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైజెస్ ఉన్నతాధికారి ఉత్తమ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఇండస్ డీల్ ప్రకారమే, 36 లక్షల ఎకరాల్లో నీటి స్టోరేజ్ కి భారత్ డ్యాములు నిర్మించుకునే అవకాశం ఉండగా, ఇంతవరకూ ఇండియా ఎలాంటి స్టోరేజ్ పనులను మొదలు పెట్టలేదు. పశ్చిమ నదులపై ఇంతవరకూ మన హక్కును వాడుకోలేదు. ఇప్పటికిప్పుడు ఆ అస్త్రాన్ని బయటకు తీసినా పాక్ భయంతో కాళ్ల బేరానికి వస్తుందని పలువురు చెబుతున్నారు. ఇంకోవైపు అఫ్గనిస్థాన్ నుంచి పాకిస్థాన్ కు ప్రవహించే కాబూల్ నదిపై డ్యామ్ లను నిర్మించేందుకు ఆఫ్గన్ కు సహకరించినా పాక్ పై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే గతంలోని ప్రభుత్వాలకు కూడా ఈ ఐడియా గురించి వివరించినప్పటికీ ఆచరణలో వెనుకంజ వేశారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కేంద్రం ఈ ఆలోచన ఆచరణలో పెట్టితే మంచి ఫలితం సాధించొచ్చని ఆయన సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more