గ్రేటర్ లో కేటీఆర్ ఒక్కడే ఉన్నాడా? | KTR ok what about corporaters

Ktr ok what about corporaters

Hyderabad corporaters, where are hyderabad corporaters, Only KTR review on hyderabad rains, Hyderabad Heavy Rains, Review on Hyderabad situation, Why people angry on TRS about Hyderabad Rains, Why Hyderabadies angry on TRS about rains

Only Minister KTR review on hyderabad heavy rains what about corporaters.

గ్రేటర్ గాలంలో కేటీఆర్ ఒక్కడేనా?

Posted: 09/24/2016 09:48 AM IST
Ktr ok what about corporaters

నగరం నీట మునిగింది.. వాటర్ లో గ్రేటర్... ఇలా ప్రాసలతో కూడిన హెడ్డింగులు వారం నుంచి టీవీ ఛానెళ్లలో, పేపర్లలో, వెబ్ సైట్లలో మారుమ్రోగిపోతున్నాయి. వానలు వస్తాయి... వాటి వెనుకే వరదలు వస్తాయి అందులో కొత్తేం ఉంది. కాకపోతే కాలు తీసి కాలు పెట్టలేనంత దారుణంగా తయారయ్యాయి నగర రోడ్లు. స్వయానా మంత్రి సమీక్షించిన ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ రెండు నెలలుగా ఎలాంటి డెవలప్ మెంట్ లేదు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. అదే సందర్భంలో తప్పు ఎవరి తరపు నుంచి ఉందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

36 ఏళ్ల నుంచి హైద‌రాబాద్‌లో ఉంటున్న‌. అతి వృష్టిలు వ‌చ్చిన‌పుడు స‌హ‌జంగా జ‌రిగే ప‌రిణామాలే ఇప్పుడూ జరిగినయి. షరా మాములే... కాక‌పోతే, ఎల‌క్ట్రానిక్ మీడియాకు రోజువారి క‌డుపు నింపుకోవ‌డానికి ఇలాంటి సంద‌ర్భాలు ఓ వారం పాటు ప‌నికొస్తాయి ఇది ఓ సీనియర్ పాత్రికేయుడి అభిప్రాయం. ఇక‌పోతే, ఎప్పుడూ లేనంత‌గా న‌గ‌ర ప్ర‌జ‌లు ఇప్పుడే సీరియ‌స్‌గా స్పందిస్తుండ‌డానికీ కార‌ణం లేక‌పోలేదు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకే ప‌ట్టంక‌ట్ట‌డానికి కార‌ణం ఉంది. ప్ర‌జ‌ల్లో ఆశ‌లు బాగా పెరిగాయి. గ‌డిచిన 9 నెల‌ల్లో శాశ్వ‌త ప‌రిష్కారాల ప‌నులు ఏవీ ఆరంభం కాలేదు. అనుకోకుండా ప‌డిన భారీ వ‌ర్షాలు ఆధికార పార్టీ హామీల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అందుకే న‌గ‌ర ప్ర‌జ‌లు అధికార పార్టీ ప‌ట్ల కొంత ఆగ్ర‌హంగా ఉన్న మాట వాస్త‌వం.

ఇక‌పోతే,న‌గ‌రానికి సంబంధించిన ప్ర‌తి విష‌యంలో మంత్రి గారే బాగా రిస్క్ తీసుకొని ప‌నిచేస్తున్నారు. అందుకు ప్ర‌జ‌లూ సంతోషిస్తున్నారు . కానీ న‌గ‌ర ప్ర‌జ‌లు 99 మంది అధికార‌పార్టీ కార్పొరేట‌ర్ల‌ను గెలిపించార‌ని మ‌ర్చిపోవ‌ద్దు. వాళ్లంతా ఏం చేస్తున్న‌ర‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి ప్ర‌జ‌లు - కారు గుర్తుకు ఓటేశారు త‌ప్ప కార్పొరేట‌ర్ ఎవ‌రో ఈరోజుకు తెలియ‌ని ప్ర‌జ‌లే ఎక్కువ‌. కార్పొరేట‌ర్లు త‌మ దందాలు చేసుకోవ‌డం త‌ప్ప ప్ర‌జాసేవ అంటే ఏమిటో వాళ్ల‌లో ఎంత మందికి తెలుసో దేవుడికే తెలియాలి. 99 మంది కార్పొరేట‌ర్లు నిత్యం ప్ర‌జ‌ల‌లో ఉంటే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా వారిని పార్టీ పురికొల్పి ఉంటే, వారి పై నిఘా ఉంచి వుంటే.. ఈ అతి వ్రుష్టిలో అధికార పార్టీ ఇంత అప‌వాదును కొనితెచ్చుకునేది కాదు. అన్నీ మంత్రిగారే చేస్తార‌నే ధోర‌ణి పెర‌గ‌డం వ‌ల్ల కార్పొరేట‌ర్ల‌లోనూ బాధ్య‌తారాహిత్యం మ‌రింత పెరిగింద‌ని చెప్పొచ్చు. అలాగే ఎక్క‌డైన ఏ కార్పొరేట‌రైనా ప్ర‌జ‌ల ప‌నులు చేసే ప్ర‌య‌త్నం చేసినా, అధికార యంత్రాంగం వారి ఆజ్ఞ‌ల‌ను ప‌ట్టించుకునే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువే న‌ని కూడా చెప్పాలి.

ఎందుకంటే, మంత్రి గారికి త‌ప్ప మిగ‌తా ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌నే ధోర‌ణి యంత్రాంగంలో ఇప్ప‌టికే పెరిగిపోయంద‌ని చెప్పొచ్చు. కాబ‌ట్టి కార్పొరేట‌ర్ల ప‌నితీరుపై ఇక‌నైనా అధికార పార్టీ ద్రుష్టిపెట్టి వారిని ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేయాలి. దాంతో అనేక కింది స్థాయి పౌర‌స‌దుపాయాలు న‌గ‌రంలో ఎక్క‌డిక‌క్క‌డ మెరుగుప‌డే అవ‌కాశం ఉంది. దుర‌ద్రుష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే... ఇప్ప‌టికీ హైద‌రాబాద్‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ గెలిచి పాలిస్తున్నద‌నే ఒక బ‌ల‌మై ముద్ర ఎక్క‌డా క‌నిపించ‌దు. కార‌ణం, గెలిచిన కార్పొరేట‌ర్ల పాత్ర‌, వాళ్ల ద్వార పార్టీ పాత్ర ప్ర‌జ‌ల్లోకి ఎక్క‌డా వెళ్ల‌క‌పోవ‌డ‌మే. కాబ‌ట్టి న‌గ‌ర దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కొంత కాలం ప‌డుతుంది. కానీ తాత్కాలికంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికార‌పార్టీ త‌న కార్పొరేట‌ర్ల‌కు పై నిఘా పెట్టి ప‌నిచేయించ‌డం చాలా కీల‌కం అని టీఆర్ ఎస్ నాయ‌క‌త్వం గుర్తిస్తే అటు పార్టీకి , ఇటు ప్ర‌భుత్వానికి, మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. గెలిచిన 99 మంది కార్పొరేట‌ర్లు కౌర‌వ సేన‌గా మిగిలిపోకుండా, ప్ర‌జా సేన‌గా మార్చి వారిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచ‌గ‌లిగితే న‌గ‌రంలో పౌర స‌దుపాయాలు కొంత మెరుగ‌య్యే అవ‌కాశం ఉంది.

అదే సమయంలో మంత్రే డైరెక్టుగా చెపుతాడు, మద్యలో విడెవడు అనే ధోరణి అధికారుల్లో నెలకొని ఉంది. కరెక్టే కానీ... మంత్రి పెద్ద పెద్ద విషయాలకు స్పందించగలడు కాని ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవలసిన బాద్యత కార్పొరెటర్లపై ఉంటది కాని వారికి తగిన గుర్తింపు విలువ దొరక పనులు సరిగ్గా జరగక కార్పొరేటర్లు అడకత్తెరలొ పోకచెక్కల్లా నలిగిపొతున్నారు... పదవులు అలంకారప్రాయం కాకుడదు అంటే అందరిని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేసి వారి పనిని వారితో వారి ద్వారానే జరిగేలా చెయ్యాలి తద్వార మంత్రి గారిపై ఒత్తిడి కుడా తగ్గుతుంది. మిగతా ప్రజా ప్రతినిధులకు కూడా బాధ్యతలు అంటే ఏంటో తెలిసి వస్తాయి. ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు వీరికి సహకరించాలన్న వృత్తి ధర్మం, బాధ్యత ప్రజలకు ఆటో మేటిక్ గా గుర్తుకు వస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Rains  KTR review  Corporaters  

Other Articles