రెయిన్ ఎమర్జెన్సీ నగర చరిత్రలో తొలిసారిగా జీహెచ్ఎంసీ దీనిని ఉపయోగించాల్సి వస్తోంది. హైదరాబాదును వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తలెత్తిన అల్పపీడనం భారీ వర్షాలకు కారణమవుతోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బకి జీహెచ్ఎంసీ రెయిన్ ఎమర్జెన్సీని ప్రకటించింది. శివార్లలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, ఆల్వాల్ లో భారీ వర్షాలు పడ్డాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదు జలమయమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్లపైకి భారీగా నీరు చేరుకుంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
#Rains and #Hyderabad. Visuals sent by a friend. #Friday morning rains n city flooded. @GHMCOnline @MinIT_Telangana pic.twitter.com/viX4gIAcxP
— dinesh akula (@dineshakula) September 16, 2016
ఎక్కువ ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాహనదారులు హైదరాబాదు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. ప్రధానంగా షాపూర్ నగర్, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టల్లో కేవలం రెండు గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఏ స్థాయిలో వర్షం కురిసిందో ఊహించవచ్చు! నగరం అంతటా వర్షం కురిస్తే సుమారు 2 సెంటీ మీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపు నీటిని మాత్రమే పీల్చుకునే అవకాశం హైదరాబాదులోని డ్రైనేజీ సిస్టమ్ కు ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
అయితే నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకుపైగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సూచనలు చేస్తూ, వాహనదారులు రోడ్లపైకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. మరో మూడు గంటల వరకు ఎవరూ రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయవద్దని, ఈ మూడు గంటలు భారీ వర్షం హైదరాబాదును ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
డేంజర్ గా హుస్సేన్ సాగర్
హైదరాబాదు నడిబొడ్డున ఉన్న హుస్సేన సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు మాన్ సూన్ సిబ్బంది, విపత్తు నిర్వహణ అధికారులను అప్రమత్తం చేసింది. గత రాత్రి కురిసిన భారీ వర్షాల ధాటికి నాలాల ద్వారా నీరు హుస్సేన్ సాగర్ కు చేరుకుంటోంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీరు హుస్సేన్ సాగర్ లోకి వస్తుండగా, 1500 క్యూసెక్కుల నీటిని బయటకి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ హుస్సేన్ సాగర్ పరిమితిని మించి నీరు వచ్చి చేరుతుండడంతో గాంధీనగర్, దోమల్ నగర్, అంబేద్కర్ నగర్, అరుంధతినగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, అంబర్ పటేల్ నగర్ వాసులు అప్రమత్తంగా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ఇంకోవైపు పలు చెరువులకు గండ్లు పడుతున్నాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి కూకట్ పల్లి సమీపంలోని మూసాపేట్ చెరువుకు గండి పడింది. దీంతో రాంకీ నగర్ నీట మునిగింది, పలు అపార్ట్ మెంట్ ల సెల్లారల్లోకి నీరు చొచ్చుకుపోయింది. నిజాంపేట్ లోని తుర్క చెరువుకు గండిపడింది. దీంతో నిజంపేట్ పరిసరాల్లోని కాలనీలన్నీ జలమయమ్యాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ కురవని వర్షాలు హైదరాబాదులో కురిశాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల లోని సూరారం కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more