యువనేత రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ థాంక్స్ PM Narendra Modi thanks Congress vice president Rahul Gandhi

Pm narendra modi thanks congress vice president rahul gandhi

#happy birthday pradhan sevak, congress, BJP, vice president rahul gandhi, PM modi, congress, BJP, rahul gandhi, PM modi, : narendra modi, modi birthday, rahul gandhi wishes

Congress vice-president Rahul Gandhi accused Prime Minister Narendra Modi of being "anti-poor" at the end of the first leg of his Deoria to Delhi kisan yatra

యువనేత రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ థాంక్స్

Posted: 09/17/2016 05:17 PM IST
Pm narendra modi thanks congress vice president rahul gandhi

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ యువనేత, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోడీపై తనదైన శైలిలో విమర్శలను సంధిస్తూనే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలను తెలియజేశారు. ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ఆయన ధన్యవాదాలు కూడా చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ఇవాళ రాహుల్ కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలను తెలిపారు.

పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ వెళ్లి తన తల్లి వద్ద ఆశీస్సులు తీసుకున్న మోదీ.. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు అభివృద్ధి సాధ్యమవుతుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ నీటి కొరత మాత్రం రాష్ట్రాన్ని వేధిస్తోందన్నారు. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా, ఆ నీటిని సంరక్షించుకోలేకపోవడంతో ఇబ్బందిగా ఉంటోందని ఆయన చెప్పారు. నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  BJP  rahul gandhi  PM modi  : narendra modi  modi birthday  rahul gandhi wishes  

Other Articles