భార్య అందం చెడగొడదామని ఏం చేశాడంటే... | Husband Suspects Wife Of Infidelity bites Her Nose Off

Husband suspects wife of infidelity bites her nose off

Husband bites Wife nose, UP husband bite wife nose, Suspected husband bite wife, Husband Suspects Wife, Husband bite beautiful wife nose, Wife nose

Husband Suspects Wife Of Infidelity bites Her Nose Off.

శాడిస్ట్ మొగుడు ఎంత పని చేశాడమ్మా!

Posted: 09/15/2016 03:42 PM IST
Husband suspects wife of infidelity bites her nose off

అనుమానం అనే పెనుభూతం ఆ మొగుడిని మృగంగా మార్చింది. అంతే తాగిన మైకంలో భార్యపై దారుణానికి ఒడగట్టాడు. భార్య అందంగా ఉంటేనే కదా పరాయి మొగుడు చూస్తాడు అంటూ పిచ్చి పనికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే...

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కి చెందిన సంజీవ్ కి ఏడేళ్ల క్రితం కమలేష్ తో వివాహం జరిగింది. సజావుగా సాగిన వీరి కాపురంలో అనుమానపు విషబీజాలు మొలకెత్తాయి. భార్య ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతుందని డౌట్ పెంచుకున్న సంజీవ్ తాగుడికి బానిసయ్యాడు. నిత్యం ఆమెను కొడుతూ వేధించసాగాడు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు పంచాయితీ కూడా నిర్వహించారంట. అయినా తీరు మారని సంజీవ్ ఈసారి భార్యపై పర్మినెంట్ ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

బుధవారం మరోసారి తాగి ఇంటికి వచ్చిన సంజీవ్ కమలేష్ మళ్లీ ఫోన్ మాట్లాడుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్రంగ కొట్టాడు. ఆపై తన భార్య అందంగా కనిపించకూడదనే ఉద్దేశంతో ఆమె ముక్కును కొరికేశాడు. నొప్పి తాళలేక ఆమె రోదిస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లంతా పోగయ్యారు. దీంతో అతగాడు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. ముక్కు తెగిన కమలేష్ ను స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ శాడిస్ట్ భర్త కోసం గాలింపుచేపట్టారు.

UP man bite wife nose

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Huband  suspect  wife  bite  Nose  

Other Articles