janasena activist's involved in making arrangemnts for seemadhardhula atma gourava sabha

Pawan kalyan s kakinada sabha named seemadhardhula atma gourava sabha

seemadhardhula atma gourava sabha, janaseena party, pawan kalyan, kakinada, powerstar fans, janasena workers, AP special status

Actor turned politician janasena president pawan kalyan to conduct seemadhardhula atma gourava sabha at kakinada on september 9th.

జనసేనాని పవన్ కల్యాన్ కాకినాడ సభకు నామకరణం..

Posted: 09/04/2016 05:35 PM IST
Pawan kalyan s kakinada sabha named seemadhardhula atma gourava sabha

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించాలని, అందుకు చిన్నా, పెద్దా.. వారు వీరు అందరూ కలసి ఉద్యమించాలని తిరుపతి ప్రస్తాన సభతో పిలుపునిచ్చిన సినీనటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్.. ఆ సభలో నిర్ధేశించినట్లుగానే ఈ నెల 9న కాకినాడలో జనసేన సభను ఏర్పాటు చేస్తూనే సదరు బహిరంగ సభకు పేరు ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం నిర్వహించనున్న ఈ సభకు 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'గా నామకరణం చేసినట్లు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య తెలిపారు.

కాకినాడ జేఎన్టీయూ క్రీడామైదానంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంపై తిరుపతి సభలో పవన్ కల్యాణ్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరశంఖం పూరించి.. విమర్శలు ఎక్కు పెట్టిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్లో కదలికలు ప్రారంభమయ్యాయి. ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.

అటు బీజేపి అధిష్టానం మాత్రం నిజాయితీగా వ్యవహరించింది. పవన్ కల్యాన్ తమపై విమర్శలు గురిపెట్టిన నేపథ్యంలో తమకు మిత్రులుగా వున్నవారు శత్రువులుగా మారుతున్నారని అందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విఫయంలో ఎలాంటి జాప్యం చేయకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో శత్రువులు పెరిగే ప్రమాదముందని కూడా భావించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాతో వచ్చే లాభం కన్న అధికంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ తరుణంలో కాకినాడ వేదికగా జరగనున్న సీమాంద్రుల ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏయే అంశాలపై టార్గెట్ చేయనున్నారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles