Groom arrested in Hyderabad for firing celebratory shots during wedding

Groom arrested in hyderabad for firing celebratory shots

Groom arrested in Hyderabad, Groom arrested for firing, groom celebratory shots, Hyderabad, Groom, Revolver, Celebratory Firing, Falaknuma, Police, Arrest, Shama Theatre

Although the incident occurred on August 22, the arrest was only made after police obtained a video clip of the firing.

పాతబస్లీలో కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో వరుడు

Posted: 09/04/2016 12:14 PM IST
Groom arrested in hyderabad for firing celebratory shots

హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ వివాహ బరాత్ కార్యక్రమంలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రెండు రివాల్వర్‌లతో స్వయంగా వరుడే గాల్లోకి కాల్పులు జరిపి మరీ తన పెళ్లి సంబరాలు జరుపుకున్నాడు. పెళ్లి కొడుకు అలా గాల్లోకి కాల్పులు జరుపుతుండగా బంధువులు, స్నేహితులు కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫలక్‌నుమాలో చోటుచేసుకుంది.

ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్సులు పొందుతున్న వారు ఇలా వేడుకల్లో తమ డాబును ప్రదర్శిస్తూ.. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుందటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ పెళ్లికొడుక్కి గన్ లైసెన్స్ ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. ఫలక్‌నుమాలో పెళ్లి కొడుకు కాల్పుల ఘటన దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ స్పందించారు. ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందన్నారు.

పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. దీంతో ఫలక్ నుమా ఏసీపీ ఆధ్వర్యంలోని నాలుగు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టి, సీసీటీవీల ఫుటేజ్ లను పరిశీలించి బరాత్ ఎక్కడి నుంచి ఎక్కడికి సాగిందో తెలుసుకున్నారు. ఆపై మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నుంచి వరుడి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని పూర్తి వివరాలను సాయంత్రంలోగా వెల్లడిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Groom  Revolver  Celebratory Firing  Falaknuma  Police  Arrest  Shama Theatre  

Other Articles