రాజకీయాలకు రోశయ్య గుడ్ బై | rosaiah announced political retirement

Rosaiah announced political retirement

Rosaiah political career, Rosaiah retirement, rosaiah good bye to congress, rosaiah on congress, Rosaiah on politics

Rosaiah announced political retirement says he dont want continue in congress also.

రోశయ్యకు రాజకీయాలంటే ఎందుకంత విరక్తి?

Posted: 09/02/2016 01:24 PM IST
Rosaiah announced political retirement

వయసు 83, రాజకీయ అనుభవం 60 ఏళ్లు. బహుశా తెలుగు రాజకీయాల్లో ఇంతటి పొలిటికల్ దిగ్గజం బహుశా ఎవరు ఉండకపోవచ్చు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ సైనికుడిగా పని చేసిన రోశయ్య, ఉమ్మడిరాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డులు సృష్టించాడు. ఏ నాయకుడి కింద తాను పని చేసే నాయకుడి కి వీర విధేయత చూపించే వారు. అందుకే ఎన్నో పదవులు దక్కాయి. చివరికి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ,జగన్ అసమ్మతి రాజకీయాలు ఆయన్ని కుదురుగా ఉండనివ్వలేదు.

తెలుగు రాజకీయాల నుంచి కొద్ది రోజులు కనుమరుగు అయిన రోశయ్య ఆపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రమోషన్ ఇవ్వటంతో తమిళనాడు గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా పదవీ కాలం ముగియటంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరి ఈ దశలో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అని అడిగితే ఆయన ఏమంటున్నాడో చూడండి. ఇకపై రాజకీయా ప్రస్తావనే లేదంటున్న ఆయన మిగిలిన జీవితం హైదారాబాద్ లోని ఇంట్లోనే సమయం గడుపుతూ విశ్రాంతి తీసుకుంటానని చెబుతున్నాడు. సుదీర్ఘ ప్రస్థానంతో అలిసిపోయా, రాజకీయాల్లోకి మరోసారి ప్రవేశించే ఛాన్స్ అస్సలు లేదు. రాజకీయాలేంటి? అసలు కాంగ్రెస్ లోనే కొనసాగాలని తాను భావించడం లేదని తెలిపారు.

డబ్బులు పారేసిన దానికో లెక్క ఉండాలన్నది ఆయన సిద్ధాంతం. అది నచ్చే ఏరీకోరీ పద్దుల లెక్కల కోసం రోశయ్యను రాజశేఖర్ రెడ్డి ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నారు. వైఎస్ హఠాన్మరణంతో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోశయ్య సొంత నేతల నుంచే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కున్నాడు. సీనియర్ నేతగా, ఆరు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తున్నప్పటికీ, అధిష్టానం నుంచి ఆ సమయంలో సరైన సహకారం అందించకపోవటం కూడా ఆయన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ దశలో ఆయన తిరిగి కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారనుకోవటం భ్రమే అవుతుంది. ఆయన చేసిన కామెంట్లు రాజకీయాలపై విరక్తితో కాదని, కాంగ్రెస్ పైనేనని ఇట్టే అర్థమైపోతుంది. యాధృచ్ఛికంగా వైఎస్ చనిపోయి అపధర్మ ముఖ్యమంత్రిగా రోశయ్య ఎన్నికైన రోజు, తన రిటైర్డ్ మెంట్ ప్రకటించింది ఈరోజే (సెప్టెంబర్ 2న) కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rosaiah  political career  end  

Other Articles