సరోగసీపై కేంద్రమంత్రి అనుప్రియా సంచలన వ్యాఖ్యలు | Minister Anupriya Patel comments on Surrogacy

Minister anupriya patel comments on surrogacy

Anupriya Patel on Surrogacy, Women Selling Bodies To Earn Livelihood, Surrogacy legislation, Anupriya Patel Surrogacy bill, Anupriya Patel comments on women, health minister Anupriya Patel

Minister Anupriya Patel comments on Surrogacy. Women Selling Bodies To Earn Livelihood she added.

అద్దె గర్భంపై మహిళా మంత్రి సంచలన కామెంట్లు

Posted: 09/02/2016 10:01 AM IST
Minister anupriya patel comments on surrogacy

సరోగసీ (అద్దె గర్భం)పై కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కడుపు నింపుకోడానికే తమ శరీరాలు అమ్ముకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయా మహిళలతో వారి కుటుంబాలు వ్యాపారం చేస్తున్నాయన్నారు. బలవంతంగా వాళ్ల గర్భాలను అద్దెకు ఇచ్చి డబ్బు వెనకేసుకుంటున్నారని ఆమె అంటున్నారు.

మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది కదా అని ప్రశ్నించగా, భారతదేశంలో ఎంతమంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అయిన అనుప్రియా అన్నారు. జీవనోపాధి కోసం గర్భాలను అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదన్న విషయాన్ని మహిళలకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే సరోగసీ బిల్లును తీసుకొచ్చిందని వివరించారు. వాణిజ్యపరమైన సరొగసీని నిషేధిస్తూ కేంద్ర మంత్రివర్గం గత వారం ఒక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం కేవలం సన్నిహిత బంధువుల కోసం మాత్రమే ఇలా చేయొచ్చని ఈ బిల్లు చెబుతోంది. తద్వారా కొత్తగా పెళ్లయిన జంటలు, ఎన్నారైలు, గేలు సరొగసీ ద్వారా పిల్లలను పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తోంది.

అయితే.. దీనివల్ల పిల్లలు లేని జంటలకు అవకాశాలు తగ్గిపోతాయని వాదన వినిపిస్తోంది. తద్వారా వారు అక్రమంగా సరొగసీకి వెళ్లే అవకాశాలు ఎక్కువవుతాయని పలువురు చెబుతున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ లేడీ శ్రీరామ్ కాలేజిలో చదివిన 35 ఏళ్ల అనుప్రియా పటేల్ ఆ సమయం నుంచే అక్రమ సరొగసీ మీద గట్టిగా పోరాడుతున్నారు. మన దేశంలో ఈ పేరుతో దాదాపు 200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని ఆమె అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health minister  Anupriya Patel  Surrogacy bill  

Other Articles