ఓటుకు నోటులో మళ్లీ విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశం | re investigate Cash For Vote Scam on CBN voice

Re investigate cash for vote scam on cbn acb court orders officials

Re investigate Cash For Vote Scam, Chandrababu Voice Cash For Vote Scam, Cash For Vote Scam CBN, Chandrababu Cash For Vote Scam, YSRCP petition on Cash For Vote Scam, Chandrabau trouble agin with Cash For Vote Scam

Re investigate Cash For Vote Scam on Chandrababu Voice, ACB court orders officials.

ఓటుకు నోటు కేసు ఈజ్ బ్యాక్

Posted: 08/29/2016 05:43 PM IST
Re investigate cash for vote scam on cbn acb court orders officials

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో విచారణ తిరిగి చేపట్టాలని సోమవారం ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. తగిన చర్యలతో పూర్తి నివేదిక రూపొందించి సెప్టెంబర్ 29 లోపు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.

కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ వీడియో, ఆడియో సాక్షాలతో సహా టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం వెలుగు చూసిన ఈ కేసులో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది స్వయానా చంద్రబాబు అని సందేహాలు తలెత్తగా, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఆ స్వరం ఆయనదేనని నివేదికలో పేర్కొంది. కేసును తిరగదోడి అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంటున్న వైఎస్సార్సీపీ వ్యూహాన్ని చంద్రబాబు ఎలా ఢిపెన్స్ చేయబోతున్నారో అని రెండు రాష్ట్రల్లో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cash For Vote Scam  Chandrababu Naidu  Re investigation  ACB court  

Other Articles