పవన్ పై విరుచుకుపడిన టీజీ వెంకటేష్ | TDP leaders fire on Pawan Kalyan over Tirupathi speech

Tdp leaders fire on pawan kalyan over tirupathi speech

TDP leaders fire on Pawan Kalyan, TG venkatesh fire on pawan kalyan, TG pawan kalyan, TG venkatesh sensational comments on pawan, TDP MP scold pawan, TDP MP TG fire

TDP leaders fire on Pawan Kalyan over Tirupathi speech.

ITEMVIDEOS:పవన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు

Posted: 08/29/2016 01:41 PM IST
Tdp leaders fire on pawan kalyan over tirupathi speech

ఏపీ ప్రత్యేక హోదా సాధించే విషయంలో అధికార పక్షంతో సహా పార్టీలన్నీ విఫలమయ్యాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఓవైపు హోదా కోసం వేచి చూద్దాం అంటూనే మిత్రపక్షాలు బీజేపీ-టీడీపీలకు చురకలు అంటించాడు. చివర్లో పోరాటం తప్పదనే సంకేతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలంతా ఇప్పుడు వరుసబెట్టి పవన్ పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఏ తెలుగుదేశం పార్టీ నేత చేయని రీతిలో టీజీ వెంకటేష్ విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది.

కర్నూలు టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జ‌న‌సేనాని కుంభకర్ణుడిలా నిద్రపోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్పుడు లేచి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల‌పై ప‌వ‌న్ చేసింది చౌక‌బారు విమ‌ర్శ‌లని టీజీ వెంకటేశ్ మండిప‌డ్డారు. రాజకీయం చేయ‌డ‌మంటే నెల‌నెలా జీతం తీసుకున్న‌ట్లు కాదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఈ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి సరిపోయిందని, ఒకవేళ త‌మిళ‌నాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత కాళ్లు, చేతులు విర‌గ్గొట్టించేవార‌ని ఆయ‌న అన్నారు. అసలు ప్రత్యేక హోదా డిమాండ్ ను మొదటి సారిగా లేవనెత్తిందే తానని టీజీ చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజా రాజ్యంకు పట్టిన గతే జనసేనకు పడుతుందని తెలిపాడు.

 

ఇక హిందీ, ఇంగ్లీష్ రాని మన ఎంపీలు పార్లమెంటులో తెలుగులో మాట్లాడుతున్నారని, ప్రధానిని నిత్యమూ సార్ సార్ అని సంబోధిస్తూ రాష్ట్రానికి హోదాను గట్టిగా డిమాండ్ చేయడంలో విఫలమవుతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, పెద్దలను గౌరవించాలి కాబట్టే ప్రధానిని సార్ అని సంబోధిస్తున్నానని, తెలుగు ప్రజలకు అర్థం కావాలనే తెలుగులో మాట్లాడతానే తప్ప, తనకు ఇంగ్లీష్, హిందీ తెలుసునని అన్నారు. పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తన పేరును ఓసారి తలచుకుని ప్రజలకు తన నోటి ద్వారా గుర్తు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. హోదాను తక్షణం తీసుకువచ్చేలా పవన్ వద్ద వ్యూహం ఉంటే వెంటనే బయటపెట్టాలని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇక పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెరైటీగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో కదలిక తెచ్చినందుకు పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ పోరాటం చేస్తామని, తమ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదని అన్నారు. తాము సంవత్సరానికి ఒకసారి వేదికపైకి ఎక్కి హోదా గురించి మాట్లాడి మరో ఏడాది పాటు కనిపించకుండా వెళ్లిపోయే రకం కాదని అన్నారు. హోదా కోసం కేంద్రంపై అనునిత్యం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. పవన్ కల్యాణ్ సభ తరువాత, ప్రతి ఒక్కరూ హోదాపై మాట్లాడటం మొదలు పెట్టారని, ఈ కదలిక ఎంత వరకూ వెళుతుందో, పవన్ తన మాట మీద ఎలా నిలబడతారో వేచి చూస్తామని కేఈ తెలిపారు. ఇంతకు ముందు మంత్రి గంటా, ఎంపీ జేసీ కూడా పవన్ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించిన సంగతి తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TG venkatesh  Pawan Kalyan  Tirupathi Speech  special Status  

Other Articles