వినోద్ హత్యలో కుల కోణం | suspect behind vinod royal murder case

Suspect behind vinod royal murder case

vinod royal murder, pawan fan murder reason, Caste war vinod royal murder

suspect elements behind vinod royal murder case, not only fans war but also caste.

వినోద్ హత్యకు ఫ్యాన్ వార్ కారణం కాదా?

Posted: 08/27/2016 10:26 AM IST
Suspect behind vinod royal murder case

వినోద్ రాయల్ హత్య కేవలం అభిమానం ఒక్కటే కారణం కాదని, దీని వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయనే వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వినోద్ తల్లి చెబుతుంది ఏంటంటే... మరో రెండు నెలలో అమెరికా వెళ్లేందుకు వినోద్ కు వీసా లభించింది. ఇది జీర్ణించుకోలేని కొంతమంది వినోద్ స్నేహితులే అతన్ని హత్య చేశారని వినోద్ తల్లి వేదవతి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు దీనికి కులపోరు రంగు పులిమేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కోలార్ ప్రాంతంలో రెండు సామాజిక వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు సాగుతోంది. వినోద్ తమ సామాజిక వర్గం వాడు కాకపోయినా, సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం నచ్చని మరో వర్గం అతనిపై కోపంతో రగిపోయిందట.

ఈ విషయమై నరసాపూర్ నందిని డాబా దగ్గర ఈ నెల 21న రాత్రి వినోద్ కి , త్రినాథ్, సునీల్ అనే వ్యక్తులతో గొడవ కూడా అయ్యిందని.అది మనసులో పెట్టుకునే మరో వ్యక్తి అక్షయ్ చేత వినోద్ రాయల్‌ను హత్య చేయించారని, ఆపై దీనికి వేరే హీరో ఫ్యాన్ చంపాడన్న రంగుపులిమారన్న ప్రచారం జరుగుతోంది. హత్య తర్వాత అరెస్టయిన వారిలో త్రినాథ్, సునీల్‌లు ఉండటం, వారిని కోలారు రూరల్ పోలీసులు విడిచి పెట్టడం ఈ అనుమానాలకు తావునిస్తోంది. ఈ విషయాన్ని వినోద్ రాయల్ తల్లిదండ్రులు పవన్ కల్యాణ్ దగ్గర ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరోవైపు పవన్ కల్యాణ్‌తో కలసి ఎన్నికల సభలలో విస్తృతంగా పాల్గొన్న నేతలెవరూ ఈ విషయమై స్పందించకపోవటం సామాజికవర్గ ఘర్షణలు ఉన్నాయని చెప్పకనే చెబుతోంది. ఈ విషయంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాను పోరాటానికి సిద్ధమని పవన్ కల్యాణ్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ నిజాయితీగా, వేగవంతంగా జరిగితేనే ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan fan  Vinod royal  death  caste  

Other Articles