కృష్ణుడిపై కామెడీ పోస్టర్ తో చిక్కుల్లో మింత్రా | Myntra faces trouble over Lord Krishna shopping poster

Myntra faces trouble over lord krishna shopping poster

Myntra faces trouble, Myntra Lord Krishna shopping poster, Myntra Apology over lord krishna poster, ban myntra in twitter, Myntra controversy

E Commerce Portal Myntra faces trouble over Lord Krishna shopping poster.

పురాణంపై జోక్ చేసిన ఫోటోతో సంబంధం లేదంట

Posted: 08/26/2016 06:21 PM IST
Myntra faces trouble over lord krishna shopping poster

ఫ్యాషన్ పోర్టల్ మింత్రా నుంచి వచ్చిన ఓ యాడ్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి పడుతున్నాయి. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశంకు సంబంధించిన ఫోటోను తమ ఈ కామర్స్ పోర్టల్ ప్రచారానికి వాడుకున్నారని, పురాణాలను హేళన చేస్తున్న మింత్రాను వెంటనే బ్యాన్ చేయాలన్న ఓ సందేశం ఇప్పుడు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది.

కృష్ణాష్టమీ సందర్భంగా రిలీజైన ఆ ఫోటో లో ఇంతకీ ఏముందంటే... దుశ్శాసనుడు ఓవైపు ద్రౌపది చీర లాగుతుంటాడు. ఇంతలో ఆమెను రక్షించేందుకు కృష్ణుడు మింత్రాలో చీరలు ఆర్డర్ ఇచ్చినట్లు అందులో ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. #boycottmyntra పేరుతో చేసిన ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అయితే ఆ ఫోటోని తాము పెట్టలేదంటూ మింత్రా ప్రకటించింది.

ఆ ఫోటో చేయించింది మేము కాదు, అసలు ప్రచారం కోసం మేము దానిని వాడలేదు అంటూ ఓ సందేశాన్ని తమ అఫీషియల్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అయినప్పటికీ మింత్రాపై విమర్శలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. గతంలో డోర్ మ్యాట్ లపై దేవుడి చిత్రాలను వేసి ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, మరో ఉదంతంలో స్నాప్ డీల్ ఇలానే వ్యవహరించి విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Myntra  Lord Krishna  shopping poster  

Other Articles