భూకంపం దాటికి ఇటలీలో 160, మయన్మార్ లో నలుగురు మృతి | Italy earthquake leaves 159 dead and Myanmar earthquake kills four.

Italy earthquake leaves 160 dead and myanmar earthquake kills four

Italy earthquake leaves 159 dead, Italy earthquake death toll, Myanmar earthquake kills four, Myanmar earthquake effect, Myanmar ancient Buddha temples

Italy earthquake leaves 159 dead and Myanmar earthquake kills three.

భూకంపం ఎఫెక్ట్ : శవాల దిబ్బగా ఇటలీ... మయన్మార్ లో స్వల్ఫ ప్రభావం

Posted: 08/25/2016 09:56 AM IST
Italy earthquake leaves 160 dead and myanmar earthquake kills four

బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం ఇటలీని అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో కూడిన భూకంపం ధాటికి నిన్న ఇటలీలోని పలు పట్టణాలు నేలమట్టమయ్యాయి. ప్రధానంగా అమట్రీస్ నగరం ఈ భూకంపం ధాటికి పూర్తిగా దెబ్బతింది. నగరంలోని భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 160కి చేరింది. ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వందల్లోనే ఉందట.

ఇరుకుగా ఉన్న భారీ భవనాలు కుప్పకూలిపోవటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆ దేశ ప్రధాని మట్టియో రెంజీ... పెను భూకంపం ఏ ఒక్కరిని వదలలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు ఆయన ప్రకటించారు.

Italy death toll earthquake

నిజానికి ఈ తీవ్రతకు ఇంతలా ప్రాణ నష్టం సంభవించిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. షాలో ఎర్త్‌క్వేక్స్ ప్రభావంతోనే ఇలా జరిగిందటున్నారు బ్రిటన్‌లోని డర్హమ్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ లెక్చరర్ డాక్టర్ రిచర్డ్ వాల్టర్స్ . దీని ప్రకారం భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉంటుంది. మామూలుగా భూకంపాలు వచ్చినప్పుడు దాని తీవ్రత భూమికి 30 నుంచి 700 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. దానివల్ల ప్రకంపనలు భూమి ఉపరితలం వరకు వచ్చి.. వాటి ప్రభావం పైన ఉన్న కట్టడాల మీద పడటానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆలోపే దాని తీవ్రత కూడా చాలావరకు తగ్గుతుంది. కానీ, ఇటలీలో ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండటం వల్లే దాని ప్రభావం ఎక్కువగా ఉండి నష్టం కూడా భారీగా సంభవించింది.

మయన్మార్ లో నలుగురు...

మరోవైపు పొరుగున ఉన్న మయన్మార్ లో 6.8 తీవ్రతతో కుదిపేసిన భూకంపం నలుగురిన బలితీసుకుంది. కానీ, అక్కడి ఆలయాల పైనే దీని ప్రభావం ఎక్కువగా చూపింది. పురాతన కట్టాడాలు కావటంతో 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. ఓ పురుషుడు, మహిళతోపాటు ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. భూకంప కేంద్రం మయన్మార్‌కు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గరలో, 90 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన రెండు రోజుల్లో మయన్మార్ లో రెండు సార్లు భూమికంపించగా, ఈ యేడాది ఇదే ప్రాంతంలో భూకంపం రావటం ఇది 26వ సారి. తాజా భూకంపం భారత్ ఈశాన్య, తూర్పు ప్రాంతలపై స్వల్ఫ ప్రభావాన్ని చూపగా, ప్రాణ నష్టం ఏం సంభవించలేదు.

Myanmar Earthquake

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Italy  Myanmar  earth quakes  death tolls  

Other Articles