నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి తో భేటీ అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించారు. కుమారస్వామితో భేటీ స్నేహపూర్వకమైనదేనని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా, అందుకు పవన్ కల్యాణ్ తిరస్కరించారు. ఆ విషయంపై తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ తో తన భేటీకి రాజీయాలతో ఎలాంటి సంబంధం లేదని కుమారస్వామి ప్రకటించారు. తన కుమారుడు త్వరలోనే చిత్రసీమలో అడుగుపెట్టనున్నాడని, ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసమే ఆయనతో భేటీ అయ్యానని ఆయన తెలిపారు. ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆసక్తిగా గమనించగా, ఊహాగానాలకు చెక్ పెట్టేస్తూ ఇద్దరు ప్రకటనలు చేయటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more