Bangladesh Villagers Clash Over Indian Fantasy Serial, 100 Injured

Bangladesh villagers clash over indian fantasy serial 100 injured

Bangladesh, Bengali TV serial, Kiranmala, clashes over Kiranmala, Dhol village, Habiganj district, Restaurant, warrior princess, mankind, evil, Police, rubber bullets, tear gas, crowd, restaurant vandalised

A brawl broke out between villagers in eastern Bangladesh arguing over the plot of an Indian fantasy television serial, leaving 100 people injured,

మన టీవీ సీరియల్ కోసం ఆ దేశంలో కత్తులతో కొట్టుకున్నారు..

Posted: 08/20/2016 09:02 AM IST
Bangladesh villagers clash over indian fantasy serial 100 injured

టీవీ సిరియల్స్ ప్రభావం ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న అనుమానాలను నివృత్తి చేసే ఘటన ఇది. వినడానికే విచిత్రంగా వున్నా.. ఒక టీవీ సిరియల్ పై అభిప్రాయబేధాలు తలెత్తి రెండు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాధం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రస్థాయికి చేరి.. ఘర్షణలకు దారి తీసింది. ఘర్షణంటే ముష్టిఘాతాలు కాదు..ఏకంగా రెండు గ్రామాల ప్రజలు కత్తులు, కర్రలు, ఇతర పదునైన అయుధాలతో పరస్పరం కలబడ్డారు. వారిని అదుపు చేసుందుకు చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలో వందమందికిపైగా గాయపడ్డారు. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? బంగ్లాదేశ్ లో హబిగంజట్ జిల్లా ధోల గ్రామంలో జరిగింది.

బంగ్లాదేశీయులు కూడా అంతటి రసవత్తరమైన సీరియళ్లు తీస్తున్నారన్న మాట. ప్రజలను ఆ సిరియల్ ఎంత అకట్టుకోకపోతే.. వారు దాని విషయంలో అంతాలా కలియబడతారు..? అనుకుంటున్నారు కదూ. కానీ ఆ సిరియల్ బంగ్లాదేశ్ ది కదు. భారత దేశానిది. బెంగాలీ బాషలో ప్రసారమయ్యే సిరయల్ బంగ్లాదేశ్ లోని హబిగంజ్ జిల్లాలోని రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది. అదేం సిరియల్ అంటున్నారా..?కిరణ్‌మాల అనే ఫేమస్ బెంగాలీ సీరియల్‌ను భారత్ తో పాటు సమీప దేశాల ప్రజలు కూడా వీక్షిస్తూవుంటారు. అదే క్రమంలో సీరియల్ ను చూసేందుకు ధోల్ గ్రామంలో ఉన్న ఓ రెస్టారెంట్ వద్దకు చేరుకున్న రెండు గ్రామాల ప్రజలు టీవీ సీరియల్ ను వీక్షించారు.

ఈ సీరియల్ చూస్తున్న సమయంలో కథ విషయంలో ప్రారంభమైన చర్చ చివరికి వాగ్వాదానికి దారితీసింది. అనంతరం ఘర్షణగా మారడంతో రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో వందమందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపు చేసేందుకు రబ్బరు బులెట్లతో కాల్పలు జరిపారు. ఇద్దరి మధ్య ప్రారంభమైన వాగ్వాదం గొడవకు దారితీసినట్టు పోలీసులు తెలిపారు. ఇక గొడవతో రెచ్చిపోయిన ఆందోళనకారులు రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పలువురు నెటిజన్లు ఇండియన్ టీవీ సీరియళ్లపై మండిపడుతున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  Bengali TV serial  Kiranmala  clashes over Kiranmala  Dhol village  

Other Articles