కుక్క బొమ్మను మింగిన బాలుడి కష్టాలు | Boy swallowing dog toy that leaves him squeaking

Boy swallowing dog toy that leaves him squeaking

Boy swallowing dog toy, Boy swallowing dog toy squeaking, Anthony swallow

Boy lands in hospital after swallowing dog toy that leaves him squeaking.

ITEMVIDEOS:ఆ బాలుడి కష్టం నవ్వు తెప్పించకమానదు

Posted: 08/18/2016 03:02 PM IST
Boy swallowing dog toy that leaves him squeaking

చిన్నపిల్లలు వస్తువులు మింగేసి ప్రమాదాల బారిన పడటం తరచూ మనం చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ బాలుడు చిన్న కుక్క బొమ్మ మింగేసిన ఒక కుర్రాడి చేస్తున్న హడావిడికి అంతా ఇంతా కాదు.

అమెరికాకు చెందిన ఆంథోనీ తన దగ్గర ఉన్న ఓ చిన్న కుక్క బొమ్మను మింగేశాడు. తర్వాత దానిని తీయడం సాధ్యం కాకపోవడంతో లబోదిబోమంటున్న ఆ కుర్రాడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏం జరిగిందని వైద్యులు ఆ కుర్రాడిని ప్రశ్నించినప్పుడు సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు.

 

ఎందుకంటే.. ఆ కుర్రాడు మాట్లాడిన ప్రతిసారి మాటలకు బదులు కుక్కపిల్ల అరుపులు వినిపిస్తున్నాయి. గట్టిగా గాలిపీల్చినా, వదిలినా, చివరికి దగ్గినా కూడా అదే కుక్కపిల్ల సౌండే. దీంతో బాలుడి కడుపులోంచి బొమ్మను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన వైద్యులకు ఇలా వీలుకాకపోవడంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఈ వీడియో చూస్తుంటే రాజేంద్రప్రసాద్ బామ్మబాట బంగారు బాట చిత్రంలో నూతన్ ప్రసాద్ ఓ సన్నివేశంలో విజిల్ మింగిన సన్నివేశం గుర్తు రాక మానదు. ఎలాగైతే నేం భానుమతి బామ్మ దెబ్బకి అది బయటికి వచ్చేస్తుంది. కానీ, ఇక్కడ పిల్లాడి పరిస్థితే పాపం. ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో అప్ లోడ్ అయిన కొన్ని గంటల్లోనే దాదాపు 90 లక్షల మంది చూశారట. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ కుర్రాడు బాధసంగతి మరిచిపోయి మరీ పడీ పడీ నవ్వుతున్నాడండీ. అది మ్యాటర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boy  swallow  dog toy  squeak  

Other Articles