Union Minister VK Singh’s wife alleges blackmail by nephew’s friend, he claims threat to his life in video

Union minister s wife alleges blackmail extortion against nephew s friend

vk singh, vk singh wife, bharti singh, vk singh wife blackmail, vk singh extortion, vk singh blackmail, bharti singh blackmail, delhi police

VK Singh's wife Bharti Singh said the man, Pradeep Chauhan, was blackmailing her with 'doctored audio and video recordings.'

కేంద్రమంత్రి సతీమణి తప్పని వేధింపులు.. హేచ్చరికలు..

Posted: 08/18/2016 02:16 PM IST
Union minister s wife alleges blackmail extortion against nephew s friend

తన సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి ఓ వ్యక్తి.. తనను బ్లాక్ మెయిల్‌ చేస్తున్నాడని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ భార్య భారతీ సింగ్‌ ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ప్రదీప్‌ చౌహాన్ తమ కుటుంబానికి తెలిసినవాడని, ఆగస్టు 6న అతనితో తాను మాట్లాడిన మాటల్ని రహస్యంగా రికార్డు చేశాడని, ఆ తర్వాత తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే ఆ సంభాషణల్ని సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడు చౌహాన్‌ వద్ద లైసెన్స్‌డ్ రివాల్వర్ ఉందని, దానితో తమ కుటుంబానికి హాని చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనకు సంబంధించిన మార్ఫింగ్‌ చేసిన ఆడియో, వీడియో రికార్డులను బయటపెడతానని చౌహాన్‌ ఆమె పేర్కొన్నారు. అతని దగ్గర ఉన్న క్లిప్పుల్లో ఏముందో తనకు తెలియదని, కానీ వాటితో బయటపెట్టి తన భర్త పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తానని అతడు ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. నిందితుడు ఆమె సంభాషణల్ని రికార్డు చేసి.. వాటిని వేరే వాటితో మిక్స్‌ చేసి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unoin minister  vk singh  bharti singh  nephew friend  black mail  extortion  

Other Articles