అరుణాచల్ మాజీ సీఎం ఆత్మహత్య | Ex Arunachal Chief Minister Kalikho Pul suicide

Ex arunachal chief minister kalikho pul suicide

Ex CM hanging himself, EX CM suicide, Arunachal Pradesh Ex CM, Congress rebal Kalikho Pul, Kalikho pul suicide

Arunachal Pradesh Ex CM Kalikho Pul suicide.

ఉరేసుకుని మాజీ సీఎం ఆత్మహత్య

Posted: 08/09/2016 11:13 AM IST
Ex arunachal chief minister kalikho pul suicide

అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్(48) ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరివేసుకుని ఆయన తనువు చాలించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కొందరు ఎమ్మెల్యేల మద్ధతుతో తిరుగుబావుట జెండా ఎగరవేసిన కలిఖో పుల్ ఫిబ్రవరి నుంచి జూలై దాకా ముఖ్యమంత్రిగా కొనసాగారు. బీజేపీ నేతలతో కుమ్మకై ఆయన రాజకీయాలు నడిపారని కాంగ్రెస్ ఆరోపించింది.

కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో పుల్ ముఖ్యమంత్రి పదవికి దక్కించుకున్నారు. ఫ్రిబవరిలో అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తేస్తున్నట్లు ప్రకటన రాగానే అర్థరాత్రి సమయంలో సీఎంగా పుల్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, గత నెలలో సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తీర్పు వెలువడ్డాక కూడా ఆయన ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే నివసిస్తున్నారు. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడివుండొచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arunachal Pradesh  Ex CM  Kalikho Pul  Suicide  hanging  

Other Articles