Venkaiah Naidu gives befitting reply to Hizbul Mujahideen chief Salahuddin

Venkaiah naidu slams sayeed salahudeen hum chief

Venkaiah naidu, venkaiah fires on syed salahuddin, Syed Salahuddin, Hizbul Mujahideen, Kashmir unrest, nuclear war, Modi government, India, Pakistan, War, India pak nuclear war, pak based terror group hizbul mujahideen

Union Minister venkaiah naidu said "Who is he and who has given him the right to speak about Kashmir? Dhamki se kuch nahin hoga

కాశ్మీర్ విషయంలో మాట్లాడేందుకు వాళ్లెవరు.?

Posted: 08/08/2016 06:25 PM IST
Venkaiah naidu slams sayeed salahudeen hum chief

కాశ్మీర్ విముక్తి కోసం భారతదేశంతో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ ముఖ్యనేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించిన నేపథ్యంలో సదరు అంశమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ భరితెగింపు వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై ఉద్రవాద సంస్థ ముఖ్యనేత సయీద్ సలహాద్దిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు.

కాశ్మీర్ గురించి చర్చించడానికి ఉగ్రవాద సంస్థకు, దాని ముఖ్యనేత సయీద్ సలావుద్దీన్ కు ఏం హక్కు వుందని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ తగలబడుతున్నా.. వాటిపై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ ప్రభుత్వం విఫలమైనందునే వారు చివరకు దేశానికి సంబంధించిన అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి ఉగ్రవాద సంస్థ
ఎవరని ఆయన ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ పాకులాట కోసమే సలహుద్దీన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

భారత్ దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదుల చోరబాటును ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకు రావడం సరైందా కాదా అన్నది పాక్ తేల్చుకోవాలని సూచించారాయన. అలాగే సలహుద్దీన్ బెదిరింపులు తమను ఏమి చేయలేమని చెప్పుకొచ్చారు. కాశ్మీర్ లో ఇప్పటికే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, ఇకనైనా పాకిస్థాన్ ఇలాంటి చర్యలను స్వస్తి పలకాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles