Hizbul Mujahideen chief Salahuddin threatens nuclear war between India, Pakistan

Will wage nuclear war against india sayeed salahudeen hum chief

Syed Salahuddin, Hizbul Mujahideen, Kashmir unrest, nuclear war, Modi government, India, Pakistan, War, India pak nuclear war, pak based terror group hizbul mujahideen

Pak-based Hizbul Mujahideen chief Syed Salahuddin has threatened a nuclear war on India over Kashmir issue.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ భరితెగింపు వ్యాఖ్యలు

Posted: 08/08/2016 12:06 PM IST
Will wage nuclear war against india sayeed salahudeen hum chief

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ మరోమారు కవ్వింపు వ్యాఖ్యలు చేసింది. యావత్ ప్రపంచం మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా తాము ఈ విషయంలో ముందుకు సాగుతామని భరితెగించిన వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్ విముక్తి కోసం భారతదేశంతో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ ముఖ్యనేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ ప్రభుత్వం తన చేయితో అన్నం తినిపించినట్లు పెంచిపోషిస్తున్నా.., ఆ విషయాలను దాచిన సలాహుదీన్ కాశ్మీర్ కోసం పోరాటంలో తమకు పాకిస్తాన్ అన్ని విధాలా సహకరించాలని నర్మగర్భవ్యాఖ్యలు చేశాడు.

విముక్తి కోసం కాశ్మీరీలు సైతం తమ చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడాలని సలావుద్దీన్ అంటున్నాడు. కాశ్మీరీల పోరాటానికి అండగా నిలవాల్సిన బాధ్యత పాకిస్థాన్ దేనని, పాక్ నిలబడితే రెండు దేశాల మధ్యా అణుయుద్ధం జరిగి, అదే ప్రపంచ యుద్ధం అవుతుందని అన్నాడు. కాశ్మీర్ లోని ప్రజలు అక్కడ రాజీపడి బతకడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్యానిస్తూ, పాక్ మద్దతివ్వకున్నా, ఐరాస తోడుగా రాకున్నా, ఆయుధాలు ధరించి యుద్ధం చేయడమే తమ విముక్తికి మార్గమన్న నిర్ణయంలో ప్రజలు ఉన్నారని అన్నాడు. ఇండియా నుంచి విముక్తి కలుగకుంటే, ప్రజలు సాయుధ తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని, ఆపై భారత్ తగిన మూల్యం చెల్లించుకునే తీరుతుందని హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syed Salahuddin  Hizbul Mujahideen  Kashmir unrest  nuclear war  Modi government  India  Pakistan  War  

Other Articles