ఆకలితో 500 ఆవుల మృతి | 500 Cows Starve To Death In Rajasthan Shelter

500 cows starve to death in rajasthan shelter

Cows Starve To Death, Rajasthan Cows died, Strike cause cows death

500 Cows Starve To Death In Rajasthan Shelter, Their Hooves Stuck In Muck.

ఆ సమ్మెతో మూగ జీవాల ప్రాణాలు పోతున్నాయి

Posted: 08/06/2016 05:09 PM IST
500 cows starve to death in rajasthan shelter

రాజస్థాన్ లో మూగ జీవాల వరుస మరణాలతో మృత్యు ఘోష మోగుతోంది. సంరక్షణ శాల‌లో పట్టించుకునే వాళ్లు లేక ఆకలి కేకలతో 500కు పైగా గోవులు మృతి చెందటం దారుణం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో ఇది చోటుచేసుకోవటం గమనార్హం.

రాజస్థాన్ లో ప్రస్తుతం గోశాల‌లో ప‌నిచేసే కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉన్నారు. మే నెల నుంచి వేతనాలు చెల్లించకపోవటంతో వారు ఆందోళ‌న కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ ఆవుల సంరక్షణను పట్టించుకునే వారే కరువయ్యారు. తిండి పెట్టేవారు లేక ఆకలితో అవి అరిచే అరుపులు కిలోమీటర్ల మేర వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. హింగోనియా ప్రాంతంలోని గోశాలలో సుమారు 8000 ఆవులు ఉండగా, అందులో 500 పైగానే ఇప్పటి దాకా మృతి చెందాయంట.

తిండి లేకపోవటం, వరుసగా కురుస్తున్న వర్షాలతో బురదమయమయిపోయి అక్కడంతా కలుషిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోగాల బారిన పడిన ఆవులు వరుసగా కుప్పకూలిపోతున్నాయి. ఆ పరిస్థితి గమనించిన స్థానికులు మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో విగత జీవులుగా పడి ఉన్న వాటిని తొలగించి గోశాలలను శుభ్రం చేస్తున్నారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని వారు విజ్నప్తి చేస్తున్నారు.

అయితే ఆవుల్లో ఎక్కువగా అనారోగ్యంతో కాకుండా ఆకలి బాధ‌తోనే మృతి చెందాయని వైద్యులు చెబుతుండటం విశేషం. గోవులతో రాజకీయం చేసే హిందుత్వ పార్టీలు ఈ విషయంలో ఇప్పటిదాకా స్పందించకపోవటం దారుణమని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cows  death  Rajasthan  Labour Strike  

Other Articles