ట్రంప్ ని మొగుడనేసిన హిల్లరీ క్లింటన్ | Hillary Clinton accidentally calls Donald Trump her husband

Hillary clinton accidentally calls donald trump her husband

Trump as Hillary Clinton Husband, Hillary Clinton tongue slip, Hillary husband Trump, Trump wife Hillary, Opponent or Husband, Trump Opponent or Husband

Hillary Clinton accidentally calls Donald Trump her husband. Addressing a joint convention of the National Association of Black Journalists and National Association of Hispanic Journalists in Washington, Clinton had a slip of tongue when she called Trump her husband instead of her opponent.

టంగ్ స్లిప్పయ్యి ట్రంప్ ని మొగుడనేసింది

Posted: 08/06/2016 03:40 PM IST
Hillary clinton accidentally calls donald trump her husband

అగ్రరాజ్యం ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హోరాహోరి ప్రచార సభల్లో వీరు ఆరోపణలు, ప్రత్యారోపణలు విరుచుకుపడుతున్నారు. అసలు అభ్యర్థులుగా ఇంకా ఖరారు కాకముందే మొదలయిన వీరి మాటల యుద్ధం ముదిరిపోయి, ఘాటు వ్యాఖ్యలు చేసుకునే రేంజ్ కి ఎదిగింది. ఈ క్రమంలో హిల్లరీ చేసిన ఓ సీరియస్ కామెంట్ హిల్లేరియస్ గా మారిపోయింది.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన నల్లజాతి, హిస్పానిక్ పాత్రికేయుల జాతీయ సంఘాల సమావేశంలో ప్రసంగించిన సందర్బంగా హిల్లరీ ప్రసంగిస్తూ ట్రంప్ పై విరుచుపడింది. చివర్లో ‘‘నా హస్బ్... నా ప్రత్యర్థి మాట్లాడుతున్న దాని గురించి నేను చెప్పేదాన్ని పోల్చి చూస్తారని ఆశిస్తున్నాను’’ అంతే అక్కడున్న వారంతా ఘోల్లున నవ్వటం ప్రారంభించారు. రెప్పపాటులోనే ఆమె చేసిన తప్పును గుర్తించి ఆ వెంటనే సరిదిద్దుకున్న జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది.

ట్రంప్ ను తన ప్రత్యర్థిగా అభివర్ణించేందుకు బదులుగా భర్తగా చెప్పిన ప్రసంగాన్ని లైవ్ లో యథాతథంగా కొన్ని చానెళ్లు ప్రచారం చేశాయి. ఆ వీడియో తర్వాత నెట్ లో కూడా అప్ లోడ్ అయ్యింది. దీంతో ఆమె ప్రసంగాన్ని వీక్షించిన వారే కాకుండా, నెటిజన్లను కూడా ఆ వీడియోను తెగ ఎంజాయ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Hillary Clinton  US  Opponent  Husband  

Other Articles