బీజేపీతో ఇక్కడ కుస్తీ... అక్కడ దోస్తీ | TDP leaders various statements on BJP over special status

Tdp leaders various statements on bjp over special status

TDP leaders various statements on BJP over special status, TDP BJP friendship, TDP break up BJP

TDP leaders various statements on BJP over special status

ఇక్కడ కటీఫ్ లు... అక్కడ మీటింగ్ లు ఏంటో?

Posted: 08/01/2016 03:20 PM IST
Tdp leaders various statements on bjp over special status

ప్రత్యేక హోదా హుళక్కే అని తెలిసి కూడా బీజేపీతో ఎలా కొనసాగుతామంటూ మీడియాకే ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలు. అధినేత చంద్రబాబుతోసహా ముక్తకంఠంతో హోదా కోసం మైత్రికి గుడ్ బై చెబుతామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ లో కూడా సోమవారం ఏపీ ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సభను స్తంభింపజేస్తుండటం చూస్తున్నాం. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ కుస్తీ అక్కడ దోస్తీ అన్న చందాగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

అవసరమైతే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంటును నిలిపి, ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోదని ఆయన అన్నారు. ఢిల్లీలో నిలదీయలేని జగన్, చంద్రబాబును విమర్శించినంత మాత్రాన ఫలితం ఉండదని చెప్పారు. ప్రధానిని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిమతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం మాని పార్టీలన్నీ కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలని ఆయన కోరాడు.

అయితే ఓవైపు ఇలా కారాలు మిరియాలు నూరుతూనే ఏపీకి ప్రత్యేకహోదా లేదంటూ రాజ్యసభలో పరోక్షంగా ప్రకటన చేసిన జైట్లీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్‌ భేటీ అవటం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ లో ఎంపీలంతా నిరసనలు కొనసాగిస్తున్న వేళ వీరిద్దరు కనిపించకుండా పోవటం, ఆపై వీరిద్దరు జైట్లీ ఛాంబర్ నుంచి బయటికి రావటం విశేషం. హోదా అంశంతోపాటు, ఆర్థిక సాయం గురించి వీరిద్దరు ఆయనతో గంటకుపైగా చర్చించినట్లు తెలుస్తోంది. ఓవైపు రాష్ట్రంలో వ్యతిరేక నినాదాలు చేస్తున్న సమయంలో పోరాటం చేస్తూనే, కేంద్రంతో సామరస్యంగా ఈ ఇద్దరు ఎంపీలు చర్చలు జరుపుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  TDP  MPs  special status  

Other Articles