తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం నో | Central says no increase of assembly seats in telugu states

Central says no increase of assembly seats in telugu states

no increase of assembly seats in telugu states, Assembly Constituencies not increased in telugu states, telugu states Assembly Constituencies

Central says no increase of assembly constituencies in telugu states.

తెలుగు రాష్ట్రాలకు ఊహించిన ఝలకే!

Posted: 07/28/2016 09:16 AM IST
Central says no increase of assembly seats in telugu states

ఊహించినట్లుగానే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. అసెంబ్లీ కి శాసనసభ స్థానాలు పెంచే ప్రసక్తే ఎట్టి పరిస్థితిలో లేదని తేల్చిచెప్పింది. సీట్ల పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కుండబద్దలు కొట్టింది. 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణకు అవకాశం ఉందని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లింది.

టీడీపీ ఎంపీ దేవేందర్‌గౌడ్ బుధవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్న కు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర హోంశాఖ కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిందా? అదే జరిగితే ఆ వివరాలేంటి? అంటూ దేవేందర్‌గౌడ్ వివరాలు కోరారు. దీనికి స్పందించిన మంత్రి హన్స్‌రాజ్ ఆర్టికల్ 170ని సవరించకుండా పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26లో ఒక రకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో మరో రకంగా ఉన్నాయని, ఈ రెండూ సంఘర్షించుకుంటే ఏది చెల్లుబాటు అవుతుందనే విషయంపై న్యాయశాఖ సలహా కోరినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేమని భారత అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్టు తెలిపారు. ఆర్టికల్ 170లోని ‘నిబంధనలకు లోబడి’ అన్న వ్యాక్యానికి బదులు ‘నిబంధనలకు సంబంధం లేకుండా’ అన్న వాక్యం చేర్చి సవరించినా కుదరదని అటార్నీ జనరల్ చెప్పినట్టు మంత్రి పేర్కొన్నారు.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్టు వివరించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే దీనివెనకే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్ద ఆలోచనే చేసింది. శాసనసభ స్థానాల సంఖ్య పెరిగితే ప్రాంతీయ పార్టీలే లాభపడతాయి తప్ప తమకేం ఒరగదని ఇలా తప్పించుకుంటుందని అర్థమౌతోంది. ఇంకోవైపు సీట్ల పెంపుతో లాభపడొచ్చని అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు ఈ ప్రకటనతో నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly Constituencies  telangana  Andhra Pradesh  Central  Devender Goud  Parliament  

Other Articles