భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నాణేల పరిస్థితులపై సర్వత్రా సందేహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పావలా, అర్థ రూపాయి సహా పలు నాణేలను దుకాణాదారులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అటు ఐదు రూపాయల కరెన్సీ నోటుపై కూడా అనుమానాలు రేకెత్తున్నాయి. ఇప్పటికే ఈ కరెన్సీ నోట్లను తీసుకుని సరుకులు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా పలువురు దుకాణాదారులు అంగీకరించడం లేదు. ఇక తాజాగా అదే తరహా సందేహాలు పది రూపాయల నాణెంపై కూడా నెలకోంది.
కొద్దిరోజులుగా పలు నగరాల్లో రూ.10 నాణెం తీసుకోవడానికి దుకాణదారులు ఇష్టపడటం లేదు. కొందరు తెలివిగా వాటిని వినియోగదారులకు అంటగడుతుంటే, ఆ తర్వాత సదరు వినియోగదారుడు మరో దుకాణానికి వెళ్లినప్పుడు వారు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజలు తికమకపడుతున్నారు. నాణెం చెల్లదంటూ ఆర్బీఐ చెప్పినట్టు వాట్సాప్లో ఎవరో పోస్ట్ చేయడం ఈ ప్రచారానికి కారణమైంది. నాణేల కలెక్షన్ అంటే ఇష్టపడేవారు సహజంగానే రూ.10 నాణేలు విడుదల కాగానే వాటిని పదలిపరుచుకోవడంతో వాటి సర్క్యూలేషన్ మార్కెట్లో పెద్దగా లేదని చెప్పాలి.
అయితే నాణెం చెల్లదంటూ జరిగిన ప్రచారంతో ఇప్పుడు అవన్నీ మార్కెట్లో చెలామణికి వస్తున్నాయని కొందరు అంటున్నారు. మరి కొందరైతే వాటిని మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. కాగా, దీనిపై లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ఫర్ బ్యాంక్స్ పంకజ్ సక్సేనా వివరణ ఇచ్చారు. రూ.10 నాణెం రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించలేదని స్పష్టం చేశారు. నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే వాటిని తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని అన్నారు. త్వరలోనే నాణేల చెల్లుబాటుపై ఆర్బీఐ స్పష్టత ఇవ్వనుందని సక్సేనా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more