శ్రీకాకుళంలో గ్రామ పెద్దల అనాగరికపు తీర్పు... కుటుంబం వెలివేత | Family Boycotted From Village For Joining Children In Private School

Family boycotted from village for joining children in private school in srikakulam

Family Boycotted in Srikakula, Joining Children In Private School, Srikakulam family panchayat decision, sujatha family boycotted

Family Boycotted From Village For Joining Children In Private School in Srikakulam.

ITEMVIDEOS:శ్రీకాకుళంలో గ్రామ పెద్దల అనాగరికపు తీర్పు

Posted: 07/19/2016 05:59 PM IST
Family boycotted from village for joining children in private school in srikakulam

ఆధునిక కాలంలో పంచాయితీ పెద్దలు అనాగరిక చర్యకు దిగారు. శ్రీకాకుళం జిల్లా దుక్కివానిపేటలో ఓ కుటుంబానికి సాంఘిక బహిష్కరణ విధించడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యపై నమ్మకం లేని ఓ తల్లి తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినందుకు ఆ గ్రామ పెద్దలు వెలివేశారు.

వివరాళ్లోకి వెళ్లితే... పల్లెల్లో స్కూలు, లేదా హాస్టల్ నిర్వహించాలంటే కనీస విద్యార్థుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతకంటే కంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూలు, లేదా హాస్టల్ ను రద్దు చేస్తుంది. దీంతో తమ గ్రామంలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని భావించిన దుక్కివానిపేట గ్రామ పెద్దలు గ్రామ బాలలంతా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించాలని నిబంధన పెట్టారు. భర్త విదేశాల్లో ఉండటంతో ఇద్దరు పిల్లలతో ఊళ్లో ఉంటున్న సుజాత అనే మహిళ ప్రభుత్వ స్కూళ్లలో పర్యవేక్షణ ఉండదని భావించి తన పిల్లలకు మంచి విద్యనందించాలన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న పలాసలోని ఓ ప్రవేట్ స్కూలులో చేర్పించింది. దీంతో ఆమెను పంచాయతీ పెద్దలు మందలించారు.

ఇలాంటి నిర్ణయం వల్ల మిగతా వారు కూడా అదే మార్గంలో పయనిస్తారని, తద్వారా గ్రామం నుంచి స్కూలు తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య లభించదని చెప్పిన సుజాత తన నిర్ణయం మార్చుకునేందుకు అంగీకరించలేదు. ఆమె కుటుంబానికి సాంఘిక బహిష్కణ శిక్ష విధిస్తున్నట్టు పంచాయతీ ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడితే, వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించింది. దీంతో ఆమె పోలీసులతోపాటు తహసీల్దార్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikakula  family  Sujatha  boycot  private school  

Other Articles