ఆ టీఆర్ఎస్ ఎంపీ మరుగుదొడ్లనూ వదల్లేదు | Chevella MP Konda Vishweshwar Reddy cleaning toilets

Chevella mp konda vishweshwar reddy cleaning toilets

MP Konda Vishweshwar Reddy in Swachh Bharat. TRS MP cleaning toilets, Chevella MP cleaning toilets, MP Konda Vishweshwar Reddy

Chevella MP Konda Vishweshwar Reddy cleaning toilets in Swachh Bharat.

ఆ టీఆర్ఎస్ ఎంపీ మరుగుదొడ్లనూ వదల్లేదు

Posted: 07/16/2016 12:11 PM IST
Chevella mp konda vishweshwar reddy cleaning toilets

సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి పథకాల్లో తెలంగాణ అధికారపక్ష నేతలు పాలుపంచుకుంటున్నంత తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఓ వైపు పాలనాపరమైన విషయాలపై దృష్టిసారిస్తూనే, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరంలో తలమునకలై ఉంటున్నారు. అయితే హరితహరంతోపాటు అదనపు బాధ్యతగా స్వచ్ఛ్ భారత్ లోనూ యాక్టివ్ గా పాల్గొంటున్నాడు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అయితే అందరిలా రోడ్లు ఊడవటం లాంటివి చేయకుండా ఏకంగా మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారు.

స్వఛ్ఛ్ భారత్ లో భాగంగా దేశంలోని పాఠశాలలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఈ మధ్య కేంద్రం ఓ తీర్మానం చేసింది. ఈ పథకంలో భాగంగా మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక టాయిలెట్స్ క్లీనర్ వాహనాన్ని సొంతంగా రూపొందించారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. ఇక శుక్రవారం స్వయంగా ఆ వాహనాన్ని తానే నడుపుకుంటూ వెళ్లి మండలంలోని పలు పాఠశాలల్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. గొల్లపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లోని పాఠశాలల్లో టాయ్ లెట్స్ ను కడిగిపడేశారు.

TRS MP cleaning toilets

MP konda vishveshwar reddy cleaning toilets

మరుగుదొడ్లను శుభ్రం చేయడం సిగ్గుపడే పనికాదని, అంతా గర్వపడే పని అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. స్వచ్ఛ పాఠశాలల నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ టాయ్ లెట్స్ క్లీనింగ్ వాహనాలకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆలోచన నచ్చిన మంత్రి కడియం శ్రీహరి అన్ని జిల్లాల్లో వీటిని ప్రవేశపెట్టాలని కలెక్టర్లకు సూచించాడని విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Chevella  Chevella  cleaning toilets  Konda Vishweshwar Reddy  

Other Articles