అమర్ నాథ్ శివలింగం అప్పుడే కరిగిపోయింది | Amarnath shivalinga has completely melted within short period

Amarnath shivalinga has completely melted within short period

Amarnath Yatra 2016, Amarnath cave Shivalinga, Amarnath Shivalinga melted, Amarnathyatra 2016 finished

Naturally formed ice linga of Lord Shiva at the Amarnath cave has completely melted for this year.

అమర్ నాథ్ శివలింగం అప్పుడే కరిగిపోయింది

Posted: 07/16/2016 10:34 AM IST
Amarnath shivalinga has completely melted within short period

అమర్ నాథ్ యాత్రికులకు పెద్ద షాకింగ్ న్యూస్. సహజ సిద్ధంగా ఉద్భవించే ఇక్కడి శివలింగం పూర్తిగా కరిగిపోయింది. 48 రోజులపాటు కొనసాగనున్న ఈ యాత్ర మొదలైన 13 రోజులకే లింగం కరిగిపోవటం విశేషం. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో పవిత్ర అమర్‌ నాథ్ గుహలో సహజసిద్ధంగా రూపుదిద్దుకుంటుంది మంచు శివలింగం. అయితే పదేళ్లుగా 20 నుంచి 18 అడుగులు ఏర్పడే ఈ విగ్రహం ఈసారికి మాత్ర కేవలం 10 అడుగులే ఏర్పడింది.

లక్షల మంది హాజరయ్యే ఈ యాత్రకు ఈసారి కేవలం 1,45,000 మంది మాత్రమే దర్శించుకున్నారంట. జూలై 2వ తేదీన ప్రారంభం కాగా ఆగస్టు 18వ తేదీ (రక్షాబంధన్) నాటికి ముగియాల్సి ఉంది. కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌ కౌంటర్‌ తో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు బిజ్‌ బెహరా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై గత బుధవారం 20 మంది అమర్‌నాథ్ యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ మానవతావాదంతో పలువురు ముస్లిం మహిళలు ప్రాణాలకు తెగించి ప్రైవేటు వాహనాల్లో వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే.

కర్ఫ్యూ వల్లే యాత్రకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నప్పటికీ, లింగం పూర్తిగా కరిగిన విషయం, యాత్రను రద్దు చేస్తున్న విషయాలపై మాత్రం స్పందించడం లేదు. ఇంకా 34 రోజుల సమయం ఉండగానే లక్షలాది మంది అమర్‌ నాథ్ యాత్రికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Himalayas  Amarnath Yatra 2016  Ice Shivalinga  

Other Articles