టర్కీలో సైన్యం తిరుగుబాటు... 48 మంది మృతి | 48 dead in attempted coup in Turkey

48 dead in attempted coup in turkey

turkey coup, coup in Turkey, attempted coup in Turkey

48 dead in attempted coup in Turkey.

ITEMVIDEOS:టర్కీలో సైన్యం తిరుగుబాటు... 48 మంది మృతి

Posted: 07/16/2016 09:13 AM IST
48 dead in attempted coup in turkey

టర్కీలో సైన్యం వైమానిక దాడులతో బీభత్స కాండ సృష్టించింది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తిరుగుబాటు ప్రకటించింది. నానాటికీ పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదం నేపథ్యంలో తిరుగుబాటు చేయక తప్పలేదని ప్రకటించింది. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి పాలనా పగ్గాలను చేజిక్కించుకోవడంతో సరిపెట్టుకోని సైన్యం రాజధాని అంకారాలోని పలు ప్రాంతాలతో పాటు పార్లమెంటు భవనంపైనా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 48 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పోలీసులు కూడా ఉన్నారు. ప్రభుత్వ టీవీ, రేడియోను టర్కీ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.

కాగా, ఈ తిరుగుబాటును ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సైనిక తిరుగుబాటు జరిగిన కాసేపటికి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి పాలనా పగ్గాలను బలవంతంగా చేజిక్కించుకోవడాన్ని ఆయన దారుణమైన చర్యగా అభివర్ణించారు. మరోవైపు దేశం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన సైన్యం... దేశంలో మార్షల్ లాను అమల్లోకి తెచ్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు కూడా సైన్యం ప్రకటించింది.

శత్రు దేశాల నుంచి రక్షించాల్సిన సైన్యమే వైమానిక దాడులకు దిగడంతో టర్కీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1960, 1971, 1980, 1993లో సైనిక తిరుగుబాటు జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Turkey  coup  Ankara  

Other Articles